Diwali 2024 School Holidays : 2024 దివాళీ పండుగ వేడుకలు.. దీపావళి నుంచి భాయ్ దూజ్ వరకు.. ముఖ్యమైన స్కూళ్ల సెలవు తేదీలివే!

Diwali 2024 School Holidays : దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న అంటే.. దీపావళి రోజున పాఠశాలలు పనిచేయవు. కొన్ని రాష్ట్రాలు దీపావళి తర్వాత రోజుల్లో కూడా పాఠశాలలకు సెలవులను కొనసాగించే అవకాశం ఉంది.

Diwali 2024 School Holidays : 2024 దివాళీ పండుగ వేడుకలు.. దీపావళి నుంచి భాయ్ దూజ్ వరకు.. ముఖ్యమైన స్కూళ్ల సెలవు తేదీలివే!

Diwali 2024 School Holidays ( Image Source : Google )

Updated On : October 25, 2024 / 7:45 PM IST

Diwali 2024 School Holidays : దీపావళి పండుగ దగ్గరపడుతోంది. ప్రతి పండుగలాగే దీపావళి పండుగ సందర్భంగా కూడా పండుగ సెలవులను ప్రకటిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చే వారం నుంచి మూతపడనున్నాయి. దీపావళి తర్వాత రోజులలో చాలావరకు మూసిఉండవచ్చు.

ఎందుకంటే.. 2024 ఏడాదిలో దీపావళి అక్టోబర్ 31, 2024న జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ తేదీన పాఠశాలలు మూతపడతాయి. నవంబర్ 1, 2024న దీపావళి తర్వాత కొన్ని పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ వంటి వేడుకల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాలు దీపావళి తర్వాత రోజుల్లో కూడా పాఠశాలలకు సెలవులను కొనసాగించే అవకాశం ఉంది.

దక్షిణ భారత్‌లో దీపావళి సెలవులు ఎప్పటివరకంటే? :
దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 31న అంటే.. దీపావళి రోజున పాఠశాలలు పనిచేయవు. తమిళనాడు అధికారిక ప్రకటన ప్రకారం.. దీపావళి తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే వారి సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని నవంబర్ 1, 20024న కూడా సెలవు దినంగా ప్రకటించింది. కర్ణాటకలో అక్టోబర్ 31 దీపావళి అయితే.. నవంబర్ 1వ తేదీని కర్ణాటక రాజ్యోత్సవ్‌గా జరుపుకుంటారు. దాంతో విద్యార్థులకు, ఇతర రంగాల్లోని వారికి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు సెలవులు ఉంటాయి.

ఉత్తర రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు :
భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళిని చాలా వైభవంగా జరుపుకుంటారు. అక్టోబరు 31న దీపావళి జరుపుకోనుండగా, దీపావళి తర్వాతి రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని భావిస్తున్నారు. దీపావళి సెలవులకు సంబంధించి స్కూల్ యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేస్తాయి.

దీపావళి పాఠశాల సెలవులు 2024 తేదీలివే :
దీపావళి పండుగకు సంబంధించిన తేదీల జాబితా ఈ కింది విధంగా ఉంది. ఓసారి పరిశీలిద్దాం.

  • ధన్తేరస్ : అక్టోబర్ 29
  • ఛోటీ దీపావళి : అక్టోబర్ 30
  • దీపావళి : అక్టోబర్ 31
  • గోవర్ధన్ పూజ : నవంబర్ 2
  • భాయ్ దూజ్ : నవంబర్ 3

దీపావళి తర్వాత సెలవులకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం స్కూళ్లలో దీపావళికి ముందే సెలవుల జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు.

Read Also : Diwali 2024 Tech Gifts : దీపావళి 2024 బెస్ట్ టెక్ గిఫ్ట్స్ మీకోసం.. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ గాడ్జెట్ కొనేసుకోండి..!