Mumbai : ‘ప్రెగ్నెంట్ మ్యాన్’.. నిజంగానే అతని కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు

అందరూ అతని పొట్ట చూసి 'ప్రెగ్నెంట్ మ్యాన్' అని వెక్కిరించేవారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన అతనికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు షాకయ్యారు. 36 ఏళ్లుగా అతను కడుపులో ఏం ఉందో తెలిసి ఆశ్చర్యపోయారు. 1999 లో జరిగిన ఈ ఘటన లేటెస్ట్‌గా వైరల్ అవుతోంది.

Mumbai : ‘ప్రెగ్నెంట్ మ్యాన్’.. నిజంగానే అతని కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు

Mumbai

Updated On : June 22, 2023 / 5:19 PM IST

Mumbai : ఇప్పుడు మీరు చదవబోయేది 1999 నాటి వాస్తవ కథ. సంజూ భగత్ అనే నాగపూర్ వాసి ఉబ్బిన పొత్తికడుపుతో కనిపించేవాడు. అందరూ అతడిని ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ అని వెక్కిరించేవారు. 36 సంవత్సరాల పాటు అతను అలాగే కనిపించాడు. ఆ తరువాత ఏం జరిగింది?

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

సంజూ భగత్ అందరిలా కాకుండా పెద్ద పొట్టతో కనిపించేవాడు. అయితే ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేవాడు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి పొట్ట పరిమాణం మరింతగా పెరిగింది. బతుకుదెరువు కోసం కష్టపడే భగత్ పనులు చేసుకుంటూ పొట్ట వాపును పట్టించుకోలేదు. ఇరుగుపొరుగువారు తన పొట్టను చూసి గేలి చేసినా భరించాడు. కానీ 1999 లో అతని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. చివరకు ముంబయిలోని ఆసుపత్రికి తరలించారు.

 

ముంబయిలో భగత్‌కు చికిత్స చేసిన డాక్టర్ అజయ్ మెహతా ముందుగా అతనిని చూసిన వెంటనే ట్యూమర్‌తో బాధపడుతున్నాడని అనుకున్నారు. ఇక అతనికి శస్త్ర చికిత్స మొదలుపెట్టిన తరువాత డాక్టర్ అజయ్ మెహతా ఆశ్చర్యపోయారు. క్యాన్సర్ కాకుండా జననాంగం, వెంట్రుకలు, కొన్ని అవయవాలు, దవడలు బయటకు వచ్చాయట. ఇక ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. ఈ విచిత్రమైన కేసును ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ గా చెప్పారు. కవలలుగా ఏర్పడేముందు మరణించారట. పిండంలో పిండం ఏర్పడిన కేసుగా దీనిని గుర్తించారట.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

శస్త్ర చికిత్స తరువాత బయటకు తీసిన వాటిని చూడటానికి భగత్ నిరాకరించాడట. అతను క్షేమంగా బయటపడి తన జీవితాన్ని కొనసాగించాడని తెలుస్తోంది. అరుదైన కేసుగా గుర్తించిన భగత్ కేసు తాజాగా మళ్లీ బయటకు వచ్చి వైరల్ గా మారింది.