Dog saved Owner Life: ఈ శునకమే లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసేవి

పెంపుడు జంతువులు తమ యజమానుల ప్రాణాలు కాపాడేందుకు వాటి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యవు. ప్రమాద సమయంలో మనిషి ఆదమరచి ఉంటే పెంపుడు జంతువులు వారిని ప్రమాదం నుంచి కాపాడిన సందర్భాలు కోకొల్లలు.

Dog saved Owner Life: ఈ శునకమే లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసేవి

Dog Saved Owner Life

Updated On : June 2, 2021 / 5:43 PM IST

Dog saved Owner Life: పెంపుడు జంతువులు తమ యజమానుల ప్రాణాలు కాపాడేందుకు వాటి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యవు. ప్రమాద సమయంలో మనిషి ఆదమరచి ఉంటే పెంపుడు జంతువులు వారిని ప్రమాదం నుంచి కాపాడిన సందర్భాలు కోకొల్లలు. ఇక తాజాగా ఢిల్లీలో అదే జరిగింది. గ్యాస్ వెలిగించి మర్చిపోవడంతో కిచెన్ మొత్తం కాలిపోయి దట్టమైన పొగ కమ్ముకుంది. బెడ్ రూమ్ లో ఉన్న యజమానికి ఈ విషయం తెలియదు. అప్పటికే మంటల తీవ్రత పెరిగింది.

ప్రమాదాన్ని పసిగట్టిన పెంపుడు శునకం బెడ్ రూమ్ డోర్ వద్దకు వచ్చి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. శునకం అరుపులు విని యజమాని దానిపై ఒకింత కోపంతోనే డోర్ తీశాడు. కళ్ళకు పొగ కనిపించడంతో అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలో నివాసం ఉంటున్న వ్యాపారి షేష్ సారంగధర్, భార్య పాలు కాచేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది.

సిమ్ లో పెట్టి మర్చిపోయింది. దీంతో స్టవ్ రాత్రి మొత్తం మండి కిచెన్ లోని వస్తువులకు మంట అంటుకుంది. శునకం పసిగట్టకపోయి ఉంటే ఇంట్లో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. శునకం మొత్తుకోవడం వల్లనే తాను బయటకు వచ్చానని ఇంటి యజమాని షేష్ సారంగధర్ తెలిపారు. అది తేకపోతే తాము ప్రాణాలు కోల్పోయేవారని విచారంతో వివరించారు.