New Delhi : ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు వాట్పాప్‌లో ప్రపోజ్ చేసిన డొమినో డెలివరీ బోయ్.. స్పందించిన పోలీసులు
ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేసాడు ఓ డెలివరీ ఏజెంట్. దీనిపై సీరియస్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన ఎలా ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు.

New Delhi
New Delhi : ఆన్ లైన్‌లో ఫుడ్ కానీ .. ఇతర వస్తువులు కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మన నంబర్ కంపెనీతో పాటు డెలివరీ ఏజెంట్లకు చేరుతుంది. కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ సంఘటన రుజువు చేసింది. డొమినో డెలివరీ బోయ్ ఓ మహిళకు ఫుడ్ డెలివరీ చేశాడు. ఆ తరువాత ‘నేను నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ వాట్సాప్‌లో ప్రపోజ్ చేశాడు. ఈ ఘటనను ఆ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీనిపై డోమినోస్ యాజమాన్యం స్పందించలేదు కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకున్నారు.
@KanishkaDadhich అనే ట్విట్టర్ యూజర్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. కబీర్ అనే డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేసిన తరువాత ఆమెతో వాట్సాప్‌లో చేసిన చాట్‌పై కనిష్క ఆందోళన చెందారు . ‘క్షమించండి.. నా పేరు కబీర్, నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను.. నేను అదే.. నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ ఆమెకు ఏజెంట్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేయడంతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీనిపై డోమినోస్ నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకున్నారు.
డెలివరీ కోసం కంపెనీ అందించిన తన సమాచారాన్ని కబీర్ దుర్వినియోగం చేసాడని కనిష్క ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీస్ హెల్ప్ లైన్ 112 స్పందించింది. కనిష్క అధికారులతో అతని సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ సమాచారాన్ని పంచుకోవడానికి డొమినోస్ నిరాకరించిందని.. దీనిపై కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయపోరాటం చేస్తానని కనిష్క చెబుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
I want to ask if this is ethical to send a delivery guy so that he could get anyone’s number and address.
Even if he liked me, this is not the way to confess. It means he has misused the number given to the company for delivery purposes.@dominos @dominos_india
— kanishka ?? (@KanishkaDadhich) June 30, 2023