CJI Chandrachud : మీపని మీరు చూసుకోండి నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు .. : న్యాయవాదికి సీజేఐ చంద్రచూడ్ వార్నింగ్
నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు.. అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

‘Don’t mess around with my authority’ CJI tells lawyer
CJI Chandrachud : మీపని మీరు చూసుకోండి..నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు..అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మైండ్ యువర్ బిజినెస్ అన్నట్లుగా కాస్త ఘాటుగానే చురకలు వేశారు సీజేఐ. మంగళవారం (ఏప్రిల్ 11,2023) ఉదయం సుప్రీంకోర్టులో కేసుల ప్రస్తావన సందర్భంగా ఓ కేసు ముందస్తు విచారణకు చేపట్టాలని..మరో ధర్మాసానానికి తీసుకెళ్లేందుకు ఓ న్యాయవాది పట్టుపట్టటంతో సీజేఐ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నా అధికారంతో చెలగాటం ఆడొద్దు.. ‘‘నా అధికారాల జోలికి రావొద్దు’’ అంటూ హెచ్చరించారు. అంటూ హెచ్చరించారు.
ఏప్రిల్ 17న సీజేఐ ధర్మాసనం విచారించనున్న పిటిషన్‌పై ముందస్తు విచారణ జరిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించారు. సదరు కేసును 14నే విచారించాలని న్యాయవాది పట్టుబట్టారు. ఆ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సీజేఐను కోరారు సదరు న్యాయవాది. దీంతో జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తంచేశారు. మీ కేసు విచారణ 17వ తేదీన లిస్ట్ అయి ఉంది. ఇప్పుడు 14వ తేదీ కోసం మరో ధర్మాసనం ముందుకు వెళ్తానని చెబుతున్నారు. నా దగ్గర ఇటువంటి ట్రిక్కులు పనిచేయవు. మీ కేసు విచారణ 17వ తేదీనే చేపడతాం. అంతే..ఇక దీనిపై పట్టుపట్టడాలు లాంటివి పెట్టుకోకుండి అంటూ సీజేఐ స్పష్టం చేశారు. ఇటువంటివి సందర్భాలు మరోసారి తెచ్చుకోకండీ..నా అధికారం గురించి మీరు నాకు చెప్పొద్దు.. అంటూ చురకలు వేశారు.
దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు తెలిపారు. దీనికి జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ.. మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం.కానీ ఇంకెప్పుడు ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నా అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి. నా అధికారాల జోలికి రావొద్దు సీజేఐను బెదిరించేల వ్యవహరించొద్దు..మీరు బెదిరిస్తే నేను భయపడను అంటూ తీవ్రంగా హెచ్చరించారు.