పూర్తి Shutdown వద్దు.. నిబంధనలు కఠినం చేద్దాం: Kerala CM

kerala cm:రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతూ పోతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా Kerala CM పినరయి విజయన్ మాట్లాడారు. మరోసారి పూర్తి స్థాయి Shutdown విధించడానికి తాము సిద్ధంగా లేమని.. కాకుంటే నిబంధనలు కఠినం చేద్దామనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పబ్లిక్ ఈవెంట్లు అయిన పెళ్లిళ్లు, అంత్యక్రియలు, గైడ్ లైన్స్ లు అనుసరించడం, మాస్క్ లు ధరించడం, భౌతిక దూరాన్ని అవలంభించడం వంటి వాటిపై మరిన్ని నిబంధనలు ఫోకస్ పెట్టనున్నట్లు వెల్లడించారు.
‘మంగళవారం సాయంత్రం జరగనున్న మీటింగ్ ఎంత సక్సెస్ అవుతుందో అందులో చర్చ ఏ రీతిలో జరుగుతుందో చెప్పలేను. ప్రతి ఒక్కరూ ప్రస్తుత విషమ పరిస్థితి గురించి అవగాహనతోనైతే ఉన్నాం. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. అదే సమయంలో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం వంటి వాటిని తప్పక పాటిస్తాం. వీటిని పాటించడాల్సిన అవసరం లేదంటే మాత్రం అది చాలా ప్రమాదకరం.
ఆరోగ్యకరంగా ఉండే మనుషుల్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది దారుణమైన పరిస్థితికి తీసుకొస్తుంది. కొవిడ్ నుంచి రికవరీ అయ్యాక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే క్వారంటైన్ నియమాలు తప్పక పాటించాలి. కొవిడ్ గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటిస్తే మనం ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోగలం. అని సీఎం వెల్లడించారు.
సోమవారం నాటికి కేరళలో 4వేల 538కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 57వేల 879 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. కేసులు తగ్గినట్లే. అధికారులు 24గంటల్లో 36వేల 27శాంపుల్స్ ను పరీక్షించినట్లు తెలిపారు.