Yamuna river: యమునా నదిలో కొట్టుకొస్తోన్న డజన్ల కొద్దీ శవాలు
యమునా నదిలో డజన్ల కొద్దీ శవాలు కొట్టుకొస్తూ కనబడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఘటనతో గ్రామస్థుల్లో ప్రాణాంతక వైరస్ పై భయం రెట్టింపు అయింది. స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో కొవిడ్-19 మృతులను..

Yamuna River
Yamuna river: యమునా నదిలో డజన్ల కొద్దీ శవాలు కొట్టుకొస్తూ కనబడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఘటనతో గ్రామస్థుల్లో ప్రాణాంతక వైరస్ పై భయం రెట్టింపు అయింది. స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో కొవిడ్-19 మృతులను నీళ్లల్లో పడేస్తున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని జిల్లాల్లో ఒక జిల్లాలో నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హామీర్ పూర్, కాన్పూర్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ బాధితుల మృతదేహాలను యమునా నదిలో పడేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
అనూప్ కుమార్ సింగ్, అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ‘హమీర్ పూర్ కు కాన్పూర్ కు మధ్యలో యమునా నది ప్రవహిస్తుంది. ఇలా చనిపోయిన శవాలను నదిలోకి విసిరేయడం అక్కడి పాత సంప్రదాయం. గతంలో ఒకటి లేదా రెండు శవాలు నది ఒడ్డున కనిపించేవి’ అని అన్నారు.