Diesel Door Delivery : నేటి నుంచి డీజిల్ డోర్ డెలివరీ

భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ డీజిల్ డోర్ డెలివరీకి సిద్ధమైంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ సేవలు ప్రారంభించింది.

Diesel Door Delivery : నేటి నుంచి డీజిల్ డోర్ డెలివరీ

Diesel Door Delivery

Updated On : August 15, 2021 / 12:00 PM IST

Diesel Door Delivery : డీజిల్ డోర్ డెలివరీ చేసేందుకు భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి హై స్పీడ్ డీజిల్ ను డోర్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. హై స్పీడ్ డీజిల్ డిమాండ్ పెరుగుతుండటంతో బీపీసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని తూర్పు ప్రాంతం ప‌రిధి (బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిసా, జార్ఖండ్) రాష్ట్రాల్లో 15 మొబైల్ బౌన్సర్స్ ద్వారా జెర్రీ క్యాన్లలో డీజిల్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

హైస్పీడ్ డోర్ డెలివ‌రీ కోసం వ‌చ్చే రెండేండ్ల‌లో దేశ‌వ్యాప్తంగా 1588 ఫ్యూయ‌ల్ కార్ట్స్‌, 129 ఫ్యూయ‌ల్ ఎంట్స్ అందుబాటులోకి తీసుకురానున్న‌ది. సుల‌భ‌త‌ర వాణిజ్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికి, క‌స్ట‌మ‌ర్ల‌కు స‌మ‌ర్థ‌వంతంగా డీజిల్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఫ్యూయ‌ల్ కార్ట్ సాయం చేస్తుంద‌ని బీపీసీఎల్ రిటైల్ ఇన్‌చార్జి, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ పీఎస్ ర‌వి తెలిపారు.