Double Murder : భార్యను వేధించిన మందుబాబులు.. నరికిచంపిన భర్త

పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

Double Murder : భార్యను వేధించిన మందుబాబులు.. నరికిచంపిన భర్త

Murder

Updated On : December 13, 2021 / 12:10 PM IST

Double Murder : పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన రవి (28) బసవ (30) అనే ఇద్దరు రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి కూడా ఫుటుగా మద్యం సేవించిన రవి, బసవ రోడ్డుపై వెళ్తున్న మహిళను అడ్డగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

చదవండి : Bangalore : కూలిన మరో భవనం.. 20 రోజుల్లో ఇది నాలుగో ప్రమాదం

అయితే అదే మహిళపై వీరిద్దరూ గతంలో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకొని వెళ్లిన మహిళ జరిగిన విషయం భర్తకు తెలిపింది. దీంతో ఆమె భర్త మహేష్ తన స్నేహితుడితో కలిసి వచ్చి రవి, బసవను నరికి హత్యచేశారు. హత్యవిషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి : Bangalore : చికెన్‌ ఫ్రై వండలేదని భార్యను హతమార్చిన భర్త

మృతులు హెచ్‌డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది. గతంలో కూడా పలువురు మహిళలు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.