Drone which hit vessel
Gujarat coast : గుజరాత్ తీరంలో ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. పోర్‌బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బయల్దేరిన సరకుల రవాణా నౌక డిసెంబర్ 25 నాటికి మంగుళూరు పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. నౌకపై దాడి సముద్రపు దొంగల పనిగా భావించారు.
ALSO READ : Jammu and Kashmir : మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి
కోస్ట్ గార్డ్ గుజరాత్ సమీపంలో గాలించగా సముద్రపు దొంగల జాడ లేదని తేలింది. డ్రోన్ దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన నౌకలో 21 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 మంది భారతీయులు, ఒకరు వియత్నాం పౌరుడు. నౌకలోని వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. కోస్ట్ గార్డ్ దాడికి గురైన నౌక వద్దకు చేరుకుంది. డ్రోన్ దాడికి గురైన నౌకను ముంబయికి దారిమళ్లించారు.
ALSO READ : 2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు
కోస్ట్ గార్డ్ డ్రోన్ దాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 తర్వాత వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన ఏడవ దాడి ఘటన అని పెంటగాన్ పేర్కొంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ మొర్ముగో గత రాత్రి ఎంవీ కెమ్ ప్లూటో వద్దకు చేరుకుంది. కోస్ట్ గార్డ్ దాడికి సంబంధించిన వివరాలను సేకరించింది.గాజాలో ఇజ్రాయెల్ తన ఎదురుదాడిని నిలిపివేసే వరకు ఎర్ర సముద్రంలో దాడులు కొనసాగిస్తామని హౌతీలు తెలిపారు.