Drunken Violence: భర్త తలను రాయితో చితక్కొటి హతమార్చిన మహిళ

బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన నమోదైంది. జక్కసంద్రా గ్రామంలోని 30ఏళ్ల మహిళ తన భర్తను రాయితో కొట్టి హతమార్చింది. మంగళవారం రాత్రి హనుమయ్య అనే 35ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా..

Drunken Violence: భర్త తలను రాయితో చితక్కొటి హతమార్చిన మహిళ

Drunken Violence

Updated On : March 25, 2022 / 7:57 AM IST

Drunken Violence: బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన నమోదైంది. జక్కసంద్రా గ్రామంలోని 30ఏళ్ల మహిళ తన భర్తను రాయితో కొట్టి హతమార్చింది. మంగళవారం రాత్రి హనుమయ్య అనే 35ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా.. తలపై రాయితో కొట్టింది.

వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న భాగ్య.. ఆవేశంలో భర్త తలపై కొట్టేసింది. ఆ తర్వాత భయంతో ఇరుగుపొరుగు వారిని, గ్రామస్థులను పిలిచి కాపాడమంటూ వేడుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హనుమయ్యను హత్య చేశారని చెప్పింది.

ప్రాథమిక సాక్ష్యాలను, ప్రధాన ఆయుధమైన రాయిని ఘటనాస్థలం నుంచి వ్యూహం ప్రకారమే పక్కకుపెట్టింది. భర్తను చంపిన ఆయుధం తెలియకూడదని దానిని బావిలోకి విసిరేసింది. ఆ తర్వాత ఆమె తన నేరాన్ని పోలీసుల ముందు స్వయంగా అంగీకరించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Read Also: భార్యతో గొడవ.. పోలీసు జీపు నుంచి దూకి మృతి చెందిన భర్త