Heart Attack : జిమ్ చేస్తూ గుండెపోటుతో డీఎస్పీ మృతి

పానిపట్ జిల్లా జైలులో డిప్యూటీ సూపరింటెండ్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్ సోమవారం ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయాడు.

Heart Attack : జిమ్ చేస్తూ గుండెపోటుతో డీఎస్పీ మృతి

DSP dies of heart attack

Updated On : October 23, 2023 / 6:16 PM IST

DSP Dies Of Heart Attack : దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. జిమ్, వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషాధకరమైన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే.. పానిపట్ జిల్లా జైలులో డిప్యూటీ సూపరింటెండ్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్ సోమవారం ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Heart Attack : గుజరాత్ లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. గర్భా ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

అప్పటికే జోగిందర్ దేశ్వాల్ గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జోగిందర్ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ, జైలు సిబ్బంది నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.