Viral Photo : కొడుకు డీఎస్పీ, తల్లి ఏఎస్ఐ…కొడుకుకు అమ్మ సెల్యూట్

ఓ కన్నతల్లి..ఉన్నతాధికారి అయిన తన కొడుకుకు సైల్యూట్ చేశారు. ఇప్పుడీ ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది.

Viral Photo : కొడుకు డీఎస్పీ, తల్లి ఏఎస్ఐ…కొడుకుకు అమ్మ సెల్యూట్

Dsp

Updated On : August 21, 2021 / 2:20 PM IST

DSP Son And ASI Mom : పిల్లలు పెద్దగై…మంచి ఉద్యోగం సంపాదించి..స్థిరపడితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే…తల్లిదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుంది. తాము పనిచేస్తున్న చోటునే…పైస్థాయిలో ఉంటే..ఇంకా ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. గతంలో పోలీసు శాఖలో ఉన్నతాధికారి అయిన కూతురికి తండ్రి సెల్యూట్ చేయడం..ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Read More : Watermelon Pizza : పుచ్చకాయతో పిజ్జా తయారు చేసిన డోమినోస్

తాజాగా.ఓ కన్నతల్లి..ఉన్నతాధికారి అయిన తన కొడుకుకు సైల్యూట్ చేశారు. ఇప్పుడీ ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ రాష్ట్రంలో అరవల్లిలో డీఎస్పీగా Vishal Rabari విధులు నిర్వహిస్తున్నారు. ఇతని తల్లి Madhuben Rabari ప్రాంతంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో..ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డీఎస్పీ విశాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా..పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Read More : JNTUK 1st Night : కాకినాడ JNTU గెస్ట్‌హౌస్‌లో నూతన దంపతుల శోభనం

ఈ సమయంలో అక్కడే ఆయన తల్లి ఉంది. ఎదురుగా నిల్చొన్న డీఎస్పీ అయిన కొడుక్కి సెల్యూట్ చేసింది. సెల్యూట్ చేస్తున్న సమయంలో ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. తల్లి కళ్లల్లో నిజమైన ఆనందం చూడాల్సిందేనంటూ..నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.