Watermelon Pizza : పుచ్చకాయతో పిజ్జా తయారు చేసిన డోమినోస్

డొమినోస్ పుచ్చకాయతో పిజ్జానుతయారుచేసింది. కొత్త రుచులను కోరుకునేవారి కోస ఈ పుచ్చకాయ పిజ్జా రెడీగా ఉంది. టేస్ట్ చేయటమే ఆలస్యం..

Watermelon Pizza : పుచ్చకాయతో పిజ్జా తయారు చేసిన డోమినోస్

Domino's Pizza Meking With Watermelon

Domino’s pizza meking with watermelon : రకరకాల పిజ్జాలు తయారీలో ఛీజ్, చికెన్, మటన్ లతోనే కాకుండా..క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి వెల్లుల్లి ఇలా ఎన్నో వేసి చేస్తారు. కానీ పుచ్చకాయతో కూడా పిజ్జాను తయారు చేస్తారనే విషయం తెలుసా? అంటే కాస్త ఆలోచిస్తాం. కానీ ప్రముఖ ఫుడ్ సంస్థ డొమినోస్ ఇటువంటి వెరైటీ పిజ్జా తయారు చేసింది. డోమినోస్… కొత్తగా పుచ్చకాయ పిజ్జా తయారుచేసింది. మరి దాన్ని ఎలా చేసింది? ఈ వెరైటీ పిజ్చా టేస్ట్ ఎలా ఉంటుంది? అంటే మరి ఆ పుచ్చకాయ పిజ్జా గురించి దాన్ని ఎలా తయారు చేసారో తెలుసుకోవాల్సిందే..చూడాల్సిందే. ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ తింటే… బోర్ కొట్టేవారు…కొత్త కొత్త టేస్టులు కోరుకునేవారికి ఇది నచ్చుతుందేమో..

ఫుడ్ కంపెనీలు కష్టమర్లను ఆకట్టుకోవటానికి కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తుంటారు. వెరైటీ వెరైటీగా ఫుడ్స్ తయారు చేస్తుంటారు. మరి ఈ పోటీ ప్రపంచంలో తప్పదుగా. పైగా కష్టమర్ల రుచులు, అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.ఈ మార్పులకు అనుగుణంగా ఫుడ్ కంపెనీలు వారిని ఫాలో అవుతుంటారు. కొత్త కొత్త రుచుల్ని తయారు చేస్తుంటారు.అలా ఏ రుచి ఎవరికి ఎలా కనెక్ట్ అవుతోందో మరి.

అటువంటి కొత్త రుచుల్లో భాగంగానే..అమూల్ సంస్థ కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టమర్లను ఆకట్టుకోవటానికి పసుపుతో ఐస్‌క్రీమ్ తయారుచేసింది. కానీ జనాలకు నచ్చలేదు.ఈమధ్య పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేసి తయారు చేసింది నచ్చేసింది.బాగా పాపులర్ కూడా అయిపోయింది. అలాగే ముంబైలో ఫాంటా కూల్‌డ్రింకుతో ఎగ్ ఆమ్లెట్ వేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ట్రెండ్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇలా కొత్త ఫుడ్స్‌లో కొన్ని నచ్చుతుంటే… కొన్ని ప్లాప్ అవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా పుచ్చకాయతో డోమినోస్ పిజ్జా… హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో.

ఆస్ట్రేలియాలో డోమినోస్ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ పుచ్చకాయ పిజ్జాను షేర్ చేసింది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే పెప్పెరోనీ పిజ్జాను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పిజ్జాలో గుండ్రంగా ఉన్నది పుచ్చపండు ముక్కే. ఇప్పటివరకూ పిజ్జాలను పిండితో చేస్తున్నారు. కానీ ఈ పుచ్చకాయ పిజ్జాలో పిండి బదులు. పుచ్చపండును వాడారు.

ఈ వీడియోలో పుచ్చకాయ ముక్కను గుండ్రంగా కోస్తున్నారు. దాన్ని గ్రిల్‌పై వేడిచేస్తూ దానిపై చీజ్, బార్బెక్ సాస్ ఇతరత్రా అన్నీ వేసి.. వేడి చేస్తున్నారు. ఇప్పుడు అందులోంచీ ఏ ముక్క తిన్నా… ఎంతో ఆరోగ్యం అని సంస్థ చెబుతోంది డొమినోస్. ఓవెన్ నుంచి బయటకు తీశాక చూస్తే… అది నార్మల్ పిజ్జాలాగానే కనిపిస్తోంది. ఓ వ్యక్తి దాన్ని కొరికి తిన్నాడు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వీడియోని 15వేల మందికి పైగా చూశారు.