డిప్యూటీ సీఎం అయిన 2రోజులకే క్లీన్ చిట్ కథనాలు?

అర్ధరాత్రి రాజకీయాలతో డిప్యూటీ సీఎంగా పదవి అందుకున్న ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్‌పై ఉన్న కేసులు కొట్టేశారంటూ కథనాలు వెలువడ్డాయి. రూ.72వేల కోట్ల ఇరిగేషన్ స్కాం కేసు ఉన్న పవార్‌పై యాంటీ కరప్షన్ బ్యూరో విచారణను ఆపేసిందని ప్రచారం జరిగింది. విదర్భ ఇరిగేషన్ స్కాంలో పవార్ పై ఉన్న కేసులు కొట్టేయలేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
1999 నుంచి 2014వరకూ పలుమార్లు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఎన్సీపీ మంత్రులలో అజిత్ పవార్ ఒకరు. కాంగ్రెస్-ఎన్సీపీ అధికారంలో ఉండగా ఇరిగేషన్ ప్రాజెక్టులలో రూ.70వేలకు పైగా స్కాంలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేసు విచారణను ఏసీబీ చేపట్టింది.
మొత్తం ఉన్న 20కేసులలో 9ఎత్తేసినట్లు వస్తున్న వార్తలపై. సోమవారం మీడియాతో మాట్లాడిన ఏసీబీ, డీజీ పరంవీర్ సింగ్ ‘మూడు నెలల క్రితమే ఈ 9కేసులలో అజిత్ పవార్ పాత్ర లేదనేది ఇంకా స్పష్టత రాలేదు. కేసులలో విచారణ కొనసాగుతుంది. ఇరిగేషన్ సంబంధిత ఫిర్యాదులలో 3వేల టెండర్లపై విచారణ జరుపుతున్నాం’ అని వెల్లడించారు.
నవంబరు 25న కేసులు క్లోజ్ చేస్తున్నట్లుగా మహారాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. అయితే ఇందులో అజిత్ పవార్ కు సంబంధం లేని కేసులు మాత్రమే క్లోజ్ చేసింది. ఇతర విషయాలు వెలుగులోకి వచ్చినా, మరిన్ని వివరాల కోసం కోర్టు ఆదేశించినా విచారణ కొనసాగిస్తామని వారు తెలిపారు.