నిఘా పెట్టారు : ఎగ్జామ్ సెంటర్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు 

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 05:54 AM IST
నిఘా పెట్టారు : ఎగ్జామ్ సెంటర్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు 

Updated On : February 7, 2019 / 5:54 AM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ గురువారం ప్రారంభం అయ్యాయి. పిల్లలు అంటూ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ గా ఉన్నారు. ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో ఉన్నారు. అంతా కూల్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో.. సడెన్ ఎంట్రీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ హడావిడి చేశారు.

 

యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శ‌ర్మ‌ ఎగ్జామ్ ఇన్విలేటర్ అవతారం ఎత్తారు. ల‌క్నోలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఉన్న న‌వ‌యుగ క‌న్యా విద్యాల‌యంలోని ఎగ్జామ్స్ సెంటర్ లో ప్రత్యక్షం అయ్యారు. పరీక్ష‌లు రాస్తున్న విద్యార్థుల దగ్గర వెళ్లి ప‌రిశీలించారు. ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ ను తనిఖీ కూడా చేశారు. వసతులు ఎలా ఉన్నాయి అని మరికొందరు స్టూడెంట్స్ ను ప్రశ్నించారు. ఫిబ్రవరి 28వ తేదీ వ‌ర‌కు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జ‌ర‌గ‌నున్నాయి. 58 ల‌క్ష‌ల మంది హాజ‌రు అవుతున్నారు. ఎగ్జామ్స్ హాల్లో చీటింగ్ జ‌ర‌గ‌కుండా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయటం విశేషం. మాస్ కాపీలు జరగకుండా స్పెషల్ పోలీస్ టీంను ఈసారి రంగంలోకి దించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న క్రమంలో.. వాటి పర్యవేక్షణకు ఏకంగా డిప్యూటీ సీఎం దినేశ్ శ‌ర్మ‌ రావటంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. షాక్ కు గురయ్యారు.