Earthquake : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు
దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. బుధవారం (జనవరి 5)న తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది.

Earthquake Of Magnitude 3.7 Hits Sikkim's Ravangla
Earthquake : దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. బుధవారం (జనవరి 5)న తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. సరిగ్గా 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని తెలిపింది. సిక్కింలోని రావన్‌గ్లా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారి ఒకరు వెల్లడించారు.
రావన్‌గ్లాలోని భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతున భూప్రకంపనలు వచ్చినట్టు తెలిపారు. రాత్రి సమయంలో భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని అధికారి తెలిపారు.
Read Also : Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజల పరుగులు.. వారంలో రెండోసారి