AnIl Deshmukh : ముందు జైలు ఫుడ్ తిను..మాజీ హోంమంత్రి విజ్ణప్తిని తిరస్కరించిన కోర్టు
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి

Deshmukh
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముందు జైలు ఫుడ్ తినాలని సూచించింది. ఒకవేళ జైలు ఫుడ్ తో సమస్య ఉత్పన్నమైతే అప్పుడు మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటాం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జైలులో ఒక బెడ్ ఏర్పాటు చేయాలన్న అనిల్ దేశ్‌ముఖ్ అభ్యర్థనను మాత్రం కోర్టు మన్నించింది. ఆయనకు కేటాయించిన గదిలో బెడ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది.
కాగా,మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఈ ఏడాది ప్రారంభంలో మాజీ ముంబై పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ. 100 కోట్ల వసూళ్లు చేయమని ఆదేశించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో అనిల్ దేశ్‌ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇక, ఈ ఆరోపణల నేపథ్యంలో దేశ్‌ముఖ్‌పై ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ ఈ కేసును తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈ నెల 2న ఈడీ అరెస్ట్ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించిన అనంరతం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర హోం మంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నప్పుడు ఆయన తన పదవిని తప్పుగా ఉపయోగించారని ఈడీ కోర్టులో వాదించింది. రాష్ట్రంలోని బార్లు రెస్టారెంట్ల ద్వారా రూ. 4.7 కోట్ల వసూలు చేసినట్టు ఆరోపించింది. డిస్మిస్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ద్వారా ఈ వసూళ్లు చేశాడని తెలిపింది.కాగా, తనపై చేసిన ఆరోపణలు అన్నింటిని దేశ్‌ముఖ్ కొట్టి పారేశారు. చెడు మార్గం పట్టాడన్న ఆరోపణలున్న ఓ పోలీసు అధికారి బూటకపు వాంగ్మూలం ఆధారంగా తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ALSO READ Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?