Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?

టికెట్‌ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ ఎంక్వైరీ (PNR), టిక్కెట్‌ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయని తెలిపింది.

Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?

Train

IRCTC Latest News : మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా ? అయితే..ఓ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లు గురించి..ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు పని చేయవని వెల్లడించింది. అయితే..మొత్తం 24 గంటలు కాకుండా..కేవలం 6 గంటల పాటు మాత్రమే ఈ సిస్టమ్ పనిచేయదని రైల్వే శాఖ పేర్కొంది. ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. టికెట్‌ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ ఎంక్వైరీ (PNR), టిక్కెట్‌ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయని తెలిపింది.

Read More : Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు

టికెట్ బుకింగ్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ పనులను నవంబర్ 14వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యన చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతి రోజు రాత్రి 11.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో టికెట్ బుకింగ్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్, టికెట్ రద్దు చేయడం, ట్రైన్ రియల్ టైం తదితర సేవలను నిలిచిపోనున్నాయి. ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే..139 నెంబర్ కు ఫోన్ చేసుకొనే అవకాశం ఇచ్చారు.

Read More : Lakhimpur Violence : మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసు దర్యాప్తు..టాస్క్ ఫోర్స్ అప్ గ్రేడ్

కరోనా కారణంగా…లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోయాయి. ఆర్నేళ్ల తర్వాత..క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరిట…కొన్ని రైళ్లను పట్టాలపైకి ఎక్కించారు. ప్యాసింజర్, లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లగానే నడుపుతూ వచ్చారు. ఈ ప్రత్యేక నెంబర్ల రైళ్లు మారాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు రావడం..వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుండడంతో..ప్రత్యేక రైళ్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకం పేరిట తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్‌ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్‌ ప్రకటించారు. దీంతో పలు మార్పులు చేయాల్సి రావడంతో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాల్సి ఉంది.