Lakhimpur Violence : మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసు దర్యాప్తు..టాస్క్ ఫోర్స్ అప్ గ్రేడ్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్​ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం

Lakhimpur Violence : మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసు దర్యాప్తు..టాస్క్ ఫోర్స్ అప్ గ్రేడ్

Sc

Updated On : November 15, 2021 / 3:36 PM IST

Lakhimpur Violence    దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్​ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం కోరుకున్న ఎవరైనా యూపీ రాష్ట్రానికి చెందని హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు చేసిన సూచనకు సోమవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంగీకరించింది.

పంజాబ్, హర్యాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్​ కుమార్ జైన్​, జస్టిస్ రంజిత్ సింగ్ పేర్లను ఇందు కోసం సుప్రీం కోర్టు సిఫార్సు చేయగా…సుప్రీం సూచనను అంగీకరిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం సోమవారం కోర్టుకు తెలిపింది. అయితే వీరితో పాటు మరికొందిరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సుప్రీం చెప్పింది.

అయితే సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం…టాస్క్ ఫోర్స్ ని అప్ గ్రేడ్ చేయాలని, సిట్ దర్యాప్తు బృందంలో సీనియర్​ ఐపీఎస్​ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా సమర్పించాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

ALSO READ Peanut Crop : వేరుశనగ పంటను ఆశించు పురుగులు – నివారణా చర్యలు