Enforcement Directorate : భూ కుంభకోణంలో లాలూ భార్య రబ్రీ, ఇద్దరు కూతుళ్లపై ఈడీ ఛార్జ్‌షీట్
బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కూతుళ్ల పేర్లతో ఉద్యోగాల కోసం భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది...

Lalu Prasad family
Lalu Prasad : బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కూతుళ్ల పేర్లతో ఉద్యోగాల కోసం భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడుగురు నిందితుల్లో మిసా భారతి, హేమా యాదవ్ ఉన్నారు.
ALSO READ : Mumbai attack mastermind : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 78 ఏళ్ల జైలు…ఐక్యరాజ్యసమితి వెల్లడి
వ్యవసాయ భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని లాలూప్రసాద్ యాదవ్, అతని కుటుంబంపై సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూకు సన్నిహితుడైన రైల్వే ఉద్యోగి అమిత్ కత్యాల్ ఈ కుంభకోణంలో పాత్ర పోషించారని తేలింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని చార్జిషీట్‌కు ప్రతిస్పందనగా ఆర్జేడీ ఆరోపించింది. బీజేపీ ఈ వాదనను తోసిపుచ్చింది.
ALSO READ : Music maestro : మ్యూజిక్ మేస్ట్రో రషీద్ ఖాన్ కేన్సరుతో కన్నుమూత
లాలూ ప్రసాద్ కుటుంబం చాలా ఏళ్లుగా అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. 2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి భూములిచ్చి రైల్వేలో ఉద్యోగాలు పొందారని తేలింది. 2022 అక్టోబర్‌లో లాలూ, దేవి, మిసాతో పాటు మరో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గతేడాది మార్చిలో సీబీఐ కేసులో లాలూ, రబ్రీ, మిసా తదితరులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ : Ram Mandir : అయోధ్య రామమందిరంలో మొదటి బంగారు తలుపు
ఢిల్లీలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు ముందు ఈడీ తన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసును జనవరి 16న జాబితా చేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, లాలూ పేరును ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొనలేదు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని భూమిని లాక్కుని కుంభకోణానికి పాల్పడ్డారని అని బీహార్ రాష్ట్ర బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి అన్నారు.