Hemant soren : జార్ఖండ్ సీఎంకు ఝలక్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.

Hemant soren

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో నెగ్గింది. బల పరీక్ష అనంతరం రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ అధికార కూటమికి చెందిన 11 మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో తాజా మాజీ సీఎం చంపయీ సోరెన్ కూడా ఉన్నారు. అయితే, హేమంత్ కు ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన విడుదలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Also Read : ఓటరుతో పాటు క్యాడర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా..

భూకుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపయీ సోరెన్ ఫిబ్రవరి 2న సీఎం పదవి చేపట్టారు. ఈడీ అరెస్టు తరువాత హేమంత్ సోరెన్ జైలుకెళ్లారు. ఇటీవల హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన సోరెన్ సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే, హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Also Read : ఇంకా అజ్ఞాతంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆందోళనలో కార్యకర్తలు.. తాడిపత్రిలో కొనసాగుతున్న హైటెన్షన్

హైకోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ఈడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనని, కేంద్ర ఏజెన్సీ తన పిటిషన్ ను త్వరగా విచారించాలని కోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఈడీ పిటిషన్ పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠభరితంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు