Farooq Abdullah : నేడు ఈడీ ముందు హాజరు కానున్న ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు పిలిచారు.

Farooq Abdullah
Farooq Abdullah : జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు పిలిచారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన నిధుల కుంభకోణానికి సంబంధించిన విషయంలో ఫరూక్ అబ్దుల్లాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. చండీగడ్ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని మూడు రోజుల క్రితం ఈడీ సమన్లు ఇచ్చింది.
బీసీసీఐ ఇచ్చిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 2002 నుంచి 2012 మధ్య ముఖ్యమంత్రి హోదాలో JKCA ఛైర్మన్‌గా ఉన్న ఫరూక్ అబ్దుల్లా ఆ సమయంలో బిసిసిఐ ఇచ్చిన నిధులను అక్రమ మార్గంలో తరలించారని ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఈ కేసులో గతంలోనే ఈడీ ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించింది. క్రికెట్ నియంత్రణ మండలి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కు 2011-12 మధ్య కాలంలో ఇచ్చిన 112 కోట్ల రూపాయలలో 46.30 కోట్ల రూపాయలు పక్క దారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అబ్దుల్లాకు చెందిన రూ. 11.86 కోట్ల రూపాయల ఆస్తులను 2020లో ఈడీ అటాచ్ చేసింది.
Also Read : K Lakshman: యూపీ నుంచి రాజ్యసభ బరిలోకి కే.లక్ష్మణ్