CM Arvind Kejriwal
CM Arvind Kejriwal : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఉదయం 11 గంటలకు విచారించనున్నారు. సీఎం కేజ్రీవాల్ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనుండటంతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈడీ విచారణకు పిలిచి సీఎంను అరెస్ట్ చేస్తారని ఆప్ భావిస్తోంది.
Also Read : Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం…దీని ప్రభావం ఎంతంటే ?
ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపించారు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ సీఎం కేజ్రీవాల్ ను ఏప్రిల్ నెలలోనే ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈడీ సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. రూ.338 కోట్ల డబ్బు మనీ లాండరింగ్ జరిగిందని సుప్రీం న్యాయమూర్తులు చెప్పారు.
Also Read : Pakistan : పాకిస్థాన్‌లో ఎదురుకాల్పులు…ఆరుగురు ఉగ్రవాదులు హతం
అర్వింద్ కేజ్రీవాల్ ను స్కాం కేసులో జైలుకు పంపించి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ ఆలోచిస్తుందని ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆరోపించారు. అలా జరిగితే ఆప్ ప్లాన్ బి అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయవచ్చనే వాదనలను మరో ఢిల్లీ మంత్రి అతిషి కూడా చేశారు. ఈడీ ప్రశ్నించిన తర్వాత సీఎంను కస్టడీలోకి తీసుకుంటుందని అతిషి ఆరోపించారు.
Also Read : BJP : నేడు బీజేపీ మూడో విడత జాబితా విడుదల
వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష నేతలందరినీ అరెస్ట్ చేయాలని యోచిస్తుందని, దీని కోసం కుట్ర పన్నుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. ఇప్పటికే ఆప్ నేతలు సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ లను మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టు చేశారు.
Also Read : IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
సీఎం కేజ్రీవాల్ ఆమోదం లేకుండా మద్యం పాలసీ వంటి స్కాం జరగదని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. మద్యం పాలసీ రూపొందించడంలో మద్యం కంపెనీల నుంచి 12 శాతం లాభాని మద్యం లాబీ చెల్లించిందని ఈడీ పేర్కొంది. మొత్తంమీద సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణ వ్యవహారంలో ఏమవుతుందనేది ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.
ఈడీ నోటీసులు ఉపసంహరించుకోవాలి : కేజ్రీవాల్
లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. లిక్కర్ కేసులో ఈడి నోటీసులు అక్రమమని, రాజకీయ ప్రేరేపితంతో నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తనకు ఇచ్చిన ఈడీ నోటీసులను ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే తనకు నోటీసులు ఇచ్చారని కేజ్రీవాల్ చెప్పారు.
Also Read : ED raids : సీఎం విచారణకు ముందు మరో ఢిల్లీ మంత్రి ఇంటిపై ఈడీ దాడులు
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ఈడీ ముందు విచారణకు హాజరు అవుతారా ? లేదా ? అనేది స్పష్టత లేదు. ఈ విషయం మరో గంటన్నర సమయంలో తేలనుంది. కాగా ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ గురువారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.