బీజేపీ ఐటీ హెడ్‌ను తిట్టిపోసిన ఎడిటర్ గిల్డ్

భారతదేశపు ఎడిటర్ గిల్డ్ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై తిట్ల వర్షం కురిపించింది. అమిత్ మాల్వియా శుక్రవారం జర్నలిస్ట్ కమ్ కాలమిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌పై వివాదాస్పదంగా ట్వీట్ పోల్ చేశాడు. ‘ఈ జర్నలిస్టు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌కు పీఆర్‌గా సరిపోతాడా’ అని ప్రశ్నిస్తూ.. కింద ఆప్షన్లుగా ఒప్పుకుంటాం, తప్పకుండా ఒప్పుకుంటాం, ఒప్పుకోం, దీనికి సంబంధమే లేదు అనే 4 ఆప్షన్లు ఇచ్చాడు.
ఇక అమిత్ మాల్వియా అనుచరులు దీనికి ఓట్ వేస్తుండటంతో వైరల్ గా మారింది. చివరికి మాల్వియాకు వ్యతిరేకంగానే అంటే ఒప్పుకోమనే సమాధానం వచ్చింది. ఈ ట్వీట్ తో బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కౌంటర్లు విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
Rajdeep Sardesai should handle PR for ISIS.
— Amit Malviya (@amitmalviya) December 27, 2019
దీనిపై ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ‘ఈ ట్వీట్ కేవలం విలువ లేనిదే కాదు. ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ సర్‌దేశాయ్ పరువు, దేశభక్తిని ప్రశ్నించేలా చేస్తుంది’ అని పేర్కొంది. పార్టీ నిర్వహించే ట్విట్టర్ పోల్స్ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, డీసెంట్ ప్రవర్తనను కలుగచజేసేలా ఉండాలి కానీ, ఇలాంటివి కాదని సూచించింది. మాల్వియా వెంటనే ఆ ట్వీట్ ను తీసేయమని బీజేపీ హెచ్చరించాలని విన్నవించుకుంది.