సికర్ లో రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి  

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 04:26 AM IST
సికర్ లో రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి  

Updated On : November 14, 2019 / 4:26 AM IST

రాజస్తాన్‌లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 13) రాత్రి జీప్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికర్ జిల్లాలోని ఖటుశ్యామ్-రింగాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్నవారంతా ఖటుశ్యామ్ ఆలయ సందర్శన కోసం వెళ్తున్నట్టు సమాచారం. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.

గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా భారతదేశంలో ప్రతిరోజూ సగటున 400 మందికి పైగా మరణాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు  చెబుతున్నాయి.