దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్.

  • Published By: sreehari ,Published On : February 21, 2019 / 10:40 AM IST
దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు

Updated On : February 21, 2019 / 10:40 AM IST

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్.

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్. పొట్టనింపుకోవడం కోసం గుడిమెట్ల మీద, ఫుట్ పాత్ ల దగ్గర బిక్షగాళ్లంతా జీవనం సాగిస్తుంటారు. బిచ్చం ఎత్తి బతుకు జట్కాబండిని నడిపిస్తుంటారు. వీరిని ఎవరూ గుర్తించరు. కనీసం పట్టించుకోరు. ఏ ప్రభుత్వం వీరిని ఆదుకోదు. సమాజంలో బతుకున్న ఈ బిక్షగాళ్లను గుర్తించేవారే లేరు. సమాజంలో తమకు గుర్తింపు లేకపోయినా.. దేశంపై బిక్షగాళ్లకు ఎంత సేవాగుణం ఉందో అజ్మీర్ కు చెందిన ఈ మహిళ యాచకురాలే గొప్ప ఉదాహరణ. బతికినంత కాలం బిక్షమెత్తి లక్షల రూపాయలను కూడబెట్టింది. తాను చనిపోయాక ఆ సొమ్ము దేశానికి ఉపయోగపడాలని భావించింది. ఒక పూట గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బిక్షం ఎత్తగా వచ్చిన డబ్బులను బ్యాంకులో దాచిపెట్టింది. 

రూ.6.61 లక్షలు బ్యాంకులో దాచింది. ఇప్పుడా ఆ సొమ్ము మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు విరాళంగా ఇచ్చింది. ఇలా తన కలను నేరవేర్చుకుంది. ఆ యాచకురాలు ఎవరో కాదు.. రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన నందిని శర్మ. 2018 ఆగస్టులో నందిని చనిపోయింది. బ్యాంకులో నేషనల్, సొసైటీ పేరిట సేవింగ్ చేసిన సొమ్మును ట్రస్టీలు ఆమె తరపున అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు. బతికినంత కాలం అజ్మీర్ లోని అంబే మాత దేవాలయం బయట నందిని బిక్షాటన చేస్తుండేది. ప్రతిరోజు బిక్షంగా వేసిన డబ్బులను తీసుకెళ్లి బ్యాంకులో సేవింగ్ చేస్తుండేది.

తన మరణానంతరం ఆ డబ్బును ట్రస్టీలకు చెందేలా నామినీలుగా చేర్చింది. ఆమె చనిపోయినప్పటి నుంచి సరైన అవకాశం కోసం ట్రస్టీలు ఎదురుచూశారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్లకు ఈ సొమ్మును విరాళంగా ఇవ్వాలని ట్రస్టీలు నిర్ణయించుకున్నారు. జిల్లా అధికార కార్యాలయాన్ని సంప్రదించి అంతా వివరించారు. అమర వీరుల పేరిట రూ. 6.61 లక్షల సొమ్మును ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి లీగల్ సెల్ అన్నీ ఫార్మాలిటీలను పూర్తి చేసింది. 

యాచకురాలు నందిని శర్మ విరాళంగా ఇచ్చిన సొమ్మును తీసుకొనేందుకు అంగీకరించింది. దాంతో పాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్టు అజ్మీర్ కలెక్టర్ విశ్వ మోహన్ శర్మ చెప్పారు. చనిపోయిన యాచకురాలు నందిని ఆత్మకు శాంతి చేకూరాలని అజ్మీర్ లోని భక్తులంతా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబే మాత దేవాలయానికి వచ్చే భక్తులంతా నందినిని ఎంతో గౌరవించేవారు. ఆమెకు ఆహారం, బట్టలు ఇచ్చి వెళ్తుండేవారు. బిక్షంగా తీసుకున్న సొమ్మును నందిని బ్యాంకులో డిపాజిట్ చేస్తుందనే విషయం ఇక్కడి భక్తులందరికి తెలుసునని దేవాయల పూజారి ఒకరు తెలిపారు.  

Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?