వార్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పెళ్లి చేసుకొని ముచ్చట తీర్చుకున్నారు.. వధువు, వరుడికి ఎన్ని సంవత్సరాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో పెండ్లి వేడుక అంగరంగవైభంగా జరిగింది. అయితే, వధువు, వరుడు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

వార్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పెళ్లి చేసుకొని ముచ్చట తీర్చుకున్నారు.. వధువు, వరుడికి ఎన్ని సంవత్సరాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Updated On : June 6, 2025 / 7:57 AM IST

Rajasthan: రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో బుధవారం పెండ్లి వేడుక అంగరంగవైభంగా జరిగింది. జూన్ 1న హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలకు శ్రీకారం చుట్టారు. 4వ తేదీన గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి వధూవరులకు పెళ్లి చేసి డీజే పాటలు, నృత్యాలతో గ్రామంలో ఊరేగించారు. అయితే, వధువు, వరుడు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం వీరి పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: బురద గుంత నుంచి బయటకు తీసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఏనుగు పిల్ల.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

వధువు జీవాలి దేవి (90ఏళ్లు), వరుడు రమాభాయ్ అంగారి (95ఏళ్లు) కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గత 70ఏళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారట. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి మనవలు కూడా ఉన్నారు. జీవితం చివరి దశలో పెళ్లిముచ్చట తీర్చుకోవాలని వారు ఆశపడ్డారు. దీంతో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఈ వృద్ధ జంటకు ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా పురుషుడు, మహిళ పరస్పర అంగీకారంతో కలిసి జీవించే సతప్రథ అనే ప్రాచీన సంప్రదాయం రాజస్థాన్ లో పలు చోట్ల నేటీకి ఉంది.

వీరి ఎనిమిది మంది పిల్లలలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ వృద్ధ దంపతులకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తులు ఉన్నారు. పెద్ద కుమారుడు బఖు ఖరారి (60) ఒక రైతు. శివరామ్ (57), కాంతిలాల్ (48), సునీత (53) ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, అనిత (50) ప్రభుత్వ నర్సు. కుమారుడు లక్ష్మణ్ లాల్ (44) ఒక రైతు. మూడవ కుమార్తె జంతు 55 సంవత్సరాల వయసులో మరణించింది. చిన్న కుమార్తె సీత.

రామభాయ్ అంగారి గుజరాత్ లో బావులు తవ్వడం, వ్యవసాయం చేయడం ద్వారా తన కుటుంబాన్ని పోషించాడు. జీవాలి దేవి 12 సంవత్సరాలు ఏంఏడీఏ సంస్థలో చేనేతపై రగ్గులు తయారు చేసింది. తరువాత ఆమె కంటిచూపు మందగించడంతో ఆమెకూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది.