Election Commission Of India
Election Commission of India : దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడవచ్చనే ఊహాగానాలను భారత ఎన్నికల సంఘం (ECI) తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్ పర్యటన తర్వాత, మీడియాతో మాట్లాడిన ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు “ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కోరుకుంటున్నాయి” అని తెలిపారు. యూపీ పర్యటనలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమని కలిసారని కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని తమకు చెప్పారని వివరించారు.
చదవండి : UP Elections 2022 : యూపీలో ఎన్నికలు జరిగేనా..! పోలీసులతో ఈసీ చర్చలు
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఎన్నికల నిర్వహణకు సంబందించిన వివరాలను వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రావడం.. అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతుండటం వలన ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి-మార్చి 2022 నుండి వాయిదా పడవచ్చని అంచనా వేశారు. అయితే, కోవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్‌ను రాజకీయ పార్టీలు ప్రచార, పోలింగ్ సమయాల్లో ఓటర్లు అనుసరించేలా.. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
చదవండి : Elections 2022: డిసెంబర్ 30న ఎన్నికల తేదీలు ప్రకటన?
SARS-CoV-2 (ఒమిక్రాన్) కొత్త వేరియంట్‌ను గుర్తించిన తరువాత దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు పెరిగినప్పటికీ, “ఉత్తరప్రదేశ్ నాలుగు ఓమిక్రాన్ కేసులను మాత్రమే నమోదయ్యాయని” చంద్ర చెప్పారు. అయితే కోవిడ్ -19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం ఈ సంవత్సరం ప్రారంభంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అప్పటికి, SARS-CoV-2 డెల్టా వేరియంట్ కోవిడ్-19 కేసులలో భారీ పెరుగుదలకు కారణమైంది. అయితే గతంలోలా కాకుండా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కోవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్‌ను మరింత ఖచ్చితంగా పాటించేలా చూస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలను వాయిదా వేయడాన్ని పరిశీలించాలని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
చదవండి : UP Elections 2022 : యూపీలో ఎన్నికలు జరిగేనా..! పోలీసులతో ఈసీ చర్చలు
కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడానికి బహిరంగ ర్యాలీలపై నియంత్రణ విధించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అసెంబ్లీ ఎన్నికల రీషెడ్యూల్‌పై అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత ఎన్నికల సంఘం బృందం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించింది. ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సుశీల్ చంద్ర స్పందిస్తూ, అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నందున, ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించాలని నిర్ణయించింది. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి : Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా ? ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ
ఓటర్ల రద్దీని తగ్గించడానికి, ఎన్నికల అధికారులకు దూరాన్ని నిర్వహించడం సులభతరం చేయడానికి 11,000 అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను వచ్చే నెలలో ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.