UP Elections 2022 : యూపీలో ఎన్నికలు జరిగేనా..! పోలీసులతో ఈసీ చర్చలు

ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు ఈసీ అధికారులు.

UP Elections 2022 : యూపీలో ఎన్నికలు జరిగేనా..! పోలీసులతో ఈసీ చర్చలు

Up Election Commission

Updated On : December 29, 2021 / 12:17 PM IST

UP Elections 2022 : ఉత్తర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న మంగళవారం, డిసెంబర్ 28, 2021నాడు లక్నో చేరుకున్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. ఆయనతో పాటు.. మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, ఇతర ఉన్నతాధికారులు యూపీలో పర్యటిస్తున్నారు.

Read This : 5% GST on Auto : కొత్త ఏడాదిలో ప్రయాణం మరింత భారం..ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు

జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలతో మంగళవారం భేటీ అయింది కేంద్ర ఎన్నికల సంఘం బృందం. ఎన్నికలు వాయిదా వేయవద్దని, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి.

ఇవాళ బుధవారం రోజున.. జిల్లాల ఎన్నికల అధికారులు, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్స్, డివిజినల్ కమిషనర్లతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. సమావేశానికి 75 జిల్లాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు ఈసీ అధికారులు.

Read This : Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్