Elections 2022: డిసెంబర్ 30న ఎన్నికల తేదీలు ప్రకటన?
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తేదీలను డిసెంబర్ 30వ తేదీన ప్రకటించబోతుంది.

Elections 2022
Elections 2022: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తేదీలను డిసెంబర్ 30వ తేదీన ప్రకటించబోతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాగా, ఎన్నికల సన్నాహకానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర వచ్చే వారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర డిసెంబర్ 28 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సమావేశం అనంతరం డిసెంబర్ 30న సాయంత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. అదే రోజు ఎన్నికల తేదీలను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉండడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే విషయం తెలియలేదు. గతంలో 2017లో అసెంబ్లీ ఎన్నికప్పుడు జనవరి మొదటి వారంలో 4వ తేదీన ఎన్నికల ప్రకటన జరిగింది. అయితే, కరోనా వైరస్‌కు సంబంధించిన ఒమిక్రాన్ వేరియంట్లపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఎన్నికలు సాధ్యమేనా? అనే ప్రశ్న వస్తోంది.