Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా ? ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ

దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య 5వందలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా...

Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా ? ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ

EC Postpone Polls In 5 States : దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌తో సమావేశం నిర్వహించనుంది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే రిపోర్టుల ప్రకారం అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌పై ఈసీ ఓ నిర్ణయానికి రానుంది.

Read More : Tirumala : శ్రీవారి టికెట్లు హాట్ కేక్‌‌లే..10 నిమిషాల వెయిటింగ్.. 5 నిమిషాల్లో ఖాళీ

వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిపై ఇప్పటి నుంచే సందిగ్ధం ఏర్పడింది. దేశంలో కరోనా, ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో 2022 ఫిబ్రవరి, మార్చిల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఒమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది.

Read More : Precautionary Dose: తెలంగాణలో 25లక్షల మందికి వ్యాక్సిన్ మూడో డోస్

దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య 5వందలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా 141మంది ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో 79, కేరళ 57, గుజరాత్‌ 49, రాజస్థాన్‌ 43, తమిళనాడు 34, కర్ణాటక 38, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 8ఒమిక్రాన్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 17రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది ఒమిక్రాన్‌ వేరియంట్‌.