Tirumala : శ్రీవారి టికెట్లు హాట్ కేక్‌‌లే..10 నిమిషాల వెయిటింగ్.. 5 నిమిషాల్లో ఖాళీ

టికెట్లు విడుదలైన 15నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం. ముందుగానే టికెట్లు విడుదల చేస్తామని చెప్పడంతో భక్తులు అలర్ట్ అయ్యారు.

Tirumala : శ్రీవారి టికెట్లు హాట్ కేక్‌‌లే..10 నిమిషాల వెయిటింగ్.. 5 నిమిషాల్లో ఖాళీ

Tirumala Brahmotsavam

Updated On : December 27, 2021 / 1:13 PM IST

Tirumala Srivari Sarva Darshan : జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని.. జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేలు చొప్పున, మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టోకెన్లు విడుదల చేసింది. అయితే…టికెట్లు విడుదలైన 15నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం. ముందుగానే టికెట్లు విడుదల చేస్తామని చెప్పడంతో భక్తులు అలర్ట్ అయ్యారు. కంప్యూటర్లు, ఫోన్లు ముందట పెట్టుకుని..అలా విడుదల చేయగానే..టీటీడీ వెబ్ సైట్ లోకి ఎంటర్ అయిపోయారు. చాలా మంది సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ పై ప్రభావం పడిందని తెలుస్తోంది. పది నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలని స్క్రీన్ పై కనిపించదని తెలుస్తోంది. తర్వాత.. టికెట్ బుకింగ్ చేసుకోవాలని అనుకున్న భక్తులకు శని, ఆదివారాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 తేదీలు బుక్ చేసుకున్నారని సమాచారం. దీంతో టికెట్లు పొందని వారు తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.

Read More : High Court: అమరావతి కేసులపై విచారణ వాయిదా

జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్‌లో ఇప్పటికే విడుదల చేయగా కేవలం గంట వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలకు గాను మొత్తం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేయగా… 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు. మరోవైపు…శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల జనవరి కోటాను టీటీడీ మంగళవారం విడుదల చెయ్యనుంది. జనవరి 1న వెయ్యి బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) ఇందులో ఉండనున్నాయి. జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500) మంగళవారం మధ్యాహ్నం విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లూ విడుదల కానున్నాయి. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల(రూ.500)ను టీటీడీ విడుదల చేయనుంది.

Read More :AP Theaters Issue : ఏపీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానుల సమావేశం

ఇక, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగెటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది టీటీడీ. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోకపోతే దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు స్పస్టం చేసింది.