Assembly Elections 2023: గంట ముందే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం

వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31 న తొలుత ఆదేశించింది

Assembly Elections 2023: గంట ముందే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం

Updated On : November 30, 2023 / 1:17 PM IST

పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే తొలుత గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించినప్పటికీ తాజాగా ఆ సమయాన్ని సవరించింది. సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వొచ్చని తాజాగా ప్రకటించింది.

వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31న తొలుత ఆదేశించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగుస్తుండడంతో మరో గంట ముందుగానే అంటే సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈరోజు సాయంత్రం 5:30 తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

Also Read: తెలంగాణ ఎన్నికల్లో వింత డిమాండ్లతో నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!