election king : ఓటమి వీరుడికి అవార్డు..218 సార్లు నామినేషన్ వేసి ఓడిపోయిన ‘ఎలక్షన్ కింగ్’కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌

election king : ఓటమి వీరుడికి అవార్డు..218 సార్లు నామినేషన్ వేసి ఓడిపోయిన ‘ఎలక్షన్ కింగ్’కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌

Election King Padmarajan (3)

Updated On : April 19, 2021 / 3:27 PM IST

Election king Padmarajan: చాలామందికి ఎన్నికల్లో పోటీ చేయటం అంటే చాలా చాలా ఇష్టం. కొంతమంది గెలవాలనే పట్టుదలతో నామినేషన్ వేసి ఎన్నికల్లో పాల్గొంటారు. గెలుపు కోసం ఎంత డబైనా ఖర్చుచేస్తారు. మరికొందరు గెలిస్తే గెలుస్తాం…లేదా ఓడతాం..పెద్ద విషయం ఏముంది? ఓ నామినేషన్ వేసేస్తే పోలా? ఇంకొందరు ఈసారైనా గెలవకపోతామా? అదష్టం తలుపు తట్టకపోతుందా? అనే ఆశతో ఎన్నికల్లో పాల్గొనటానికి నామినేషన్ వేస్తారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయటం..ఓటమిపాలవ్వటంతో కూడా రికార్డులు క్రియేట్ చేయొచ్చని నిరూపించే ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే. దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆయన నామినేషన్ వేస్తారు. పోనీ ఒక్కసారైనా గెలిచాడా? అంటే అబ్బే లేదు.ఓడిపోతునూ ఉన్నాడాయన. అయినా నామినేషన్ వేయటం మాత్రం మాననే మానడు.

1

ఓడిపోవటంలో కూడా రికార్డుల్లోకి ఎక్కొచ్చ‌ని నిరూపించాడు త‌మిళ‌నాడుకు చెందిన ప‌ద్మరాజ‌న్ అనే వ్యక్తి‌. పద్మరాజన్ అనే పేరు చెబితే పెద్దగా ఎవ్వరికీ తెలీదు.కానీ ‘ఎలక్షన్ కింగ్’ అంటూ మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. పద్మరాజన్ నామినేష‌న్ ఉండాల్సిందే.

2

అలా ఆయన నామినేషన్ ప్రస్థానం 1988 నుంచి మొదలైందని చెప్పాలి. పద్మరాజన్ దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ప‌ద్మ‌రాజ‌న్ నామినేష‌న్ వేసి తీరతారు. ఈయనగారి నామినేషన్ ప్రక్రియ ఎంతగా ఉంటుందంటే..ఏకంగా ఓసారైతే ఏకంగా శ‘రాష్ట్రపతి’’ ఎన్నికల్లో కూడా నామినేషన్‌ వేశారు. అదీ దటీజ్ ఓటమి కింగ్ పద్మరాజన్ నామినేషన్ స్టైల్..!

4

ఎన్నికలు వచ్చాయంటే చాలు పద్మరాజన్ కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. ఎక్కడలేని ఊపూ వచ్చేస్తుంది. అంతే నామినేషన్ వేయాల్సిన డేట్ కోసం వెయిట్ చేస్తాడు. అలా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎన్నోసార్లు నామినేషన్ వేసి ఓడిపోయాడు. అలా ఎన్నిసార్లు పోటీ నిలిచినా గెలిచిందే లేదు. రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో పద్మరాజన్ వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పద్మరాజన్‌ ఇప్పటి వరకు 218 సార్లు నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలా ఆయన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటుంది. అలాగే ఓటమి ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది.

5

ఇదిలా ఉంటే తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా బ‌రిలోకి దిగారు ఈ ఎలక్షన్ కింగ్..నామినేషన్ల కింగ్..ఓటమిల కింగ్ పద్మరాజన్.. దీంతో పద్మరాజన్ కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. అదే..‘‘పద్మరాజన్ నామినేషన్ వేశాడా? గెలిచినందుకు కాదు ఓడి నందుకు’’అనే గుర్తింపు తెచ్చుకున్నాడు.

10

అవును మరి..ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ప‌ద్మ రాజ‌న్‌ను గుర్తించింది. తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను పంపించారు. గిన్నిస్ బుక్‌ రికార్డుల్లోకి ఎక్క‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు ప‌ద్మ‌రాజ‌న్‌.