Madras High Court : భర్త ఆస్తులన్నింటిలోను భార్యకు సమాన వాటా : హైకోర్టు కీలక తీర్పు

ఓ గృహిణిగా ఆమె కటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం వలనే ఎటువంటి ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనులు చూసుకుంటుంటాడు. అలా అతను ఇంటి ఒత్తిడి లేకుండా పనిచేయటానికి వీలు కలుగటానికి కారణం భార్యే. అటువంటి భార్యకు అతను సంపాదించే ప్రతీ ఆస్తిలోను వాటా ఉంటుందని తేల్చి చెప్పింది మద్రాసు హైకోర్టు.

Madras High Court : భర్త ఆస్తులన్నింటిలోను భార్యకు సమాన వాటా : హైకోర్టు కీలక తీర్పు

Wife Equal share of husband property

Updated On : June 26, 2023 / 4:52 PM IST

Equal share of husband property to wife : భర్త ఉద్యోగానికి వెళ్లినా..వ్యాపారానికి వెళ్లినా భార్య అన్ని విధాల సహకరిస్తుంది. ఇంటి పని, వంటపనితో పాటు అత్తమామలు..ఇంటి బాధ్యతల్ని చూసుకుంటుంది. అటువంటి మహిలకు భర్త ఆస్తిపై హక్కు ఉంటుందా? వాటా ఉంటుందా? భర్తే సంపాదిస్తున్నాడు కాబట్టి ఆమెకు ఎటువంటి హక్కులు,వాటాలు ఉండవా? అంటూ ఉండి తీరుతాయంటూ స్పష్టంచేసింది మద్రాసు హైకోర్టు. భర్త డబ్బు సంపాదన కోసం కష్టపడుతుంటే అతనికి చేదోడు వాదోడుగా ఇంటి బాధ్యతల్ని చూసుకునే భర్తకు అన్ని హక్కులు, వాటాలు ఉంటాయని తాజాగా ఓ కేసు విషయంలో ఇచ్చిన తీర్పులో స్పష్టంచేసింది మద్రాస్ హైకోర్టు.

ఓ గృహిణిగా ఆమె కటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం వలనే ఎటువంటి ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనులు చూసుకుంటుంటాడని..అలా అతను ఇంటి ఒత్తిడి లేకుండా పనిచేయటానికి వీలు కలుగటానికి కారణం భార్యేనని అటువంటి భార్యకు అతను సంపాదించే ప్రతీ ఆస్తిలోను వాటా ఉంటుందని తేల్చి చెప్పింది మద్రాసు హైకోర్టు.

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

అతను ఉద్యోగం చేయటానికి వెళ్లినా, వ్యాపారం చేయటానికి వెళ్లినా..ఆస్తులు కూడబట్టటానికి కారణం భార్య సహకారమేనని అటువంటి భార్యకు భర్త తన పేరున సంపాదించిన ఆస్తులన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారు అని ఓ కేసు తీర్పు సందర్భంగా గత బుధవారం (జూన్ 21,2023) జస్టిస్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు భార్యల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించే చట్టాన్ని రూపొందించలేదని.. వారి సేవలను గుర్తించకుండా ఈ న్యాయస్థానాన్ని ఎవరూ నిరోధించలేరని న్యాయమూర్తి ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

Divorce: ప్రపంచంలో విడాకుల శాతం ఎక్కువ ఉన్న దేశాలు ఏవో తెలుసా..? భారత్ పరిస్థితి ఏమిటి?

కుటుంబ ఆస్తులు భర్త సంపాదన వెనుక భార్య పరోక్షంగా ఇచ్చే సహాయ సహకారాలతో ఇచ్చిన భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. భార్య ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్విర్తించటం వల్ల భర్త నిశ్చింతగా సంపాదించడానికి వీలుకలుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తిస్తోందని స్పష్టంచేశారు. వివాహం అయి అత్తింటికి వచ్చిన మహిళ భర్త కుటుంబాన్నే తన కుటుంబంగా భావిస్తుందని..భర్తను, పిల్లలను అతని కుటుంబ సభ్యులను బాధ్యతగా చూసుకుంటుందని అన్నారు. అలా ఆమె జీవితమంతా కుటుంబం కోసమే కష్టపడుతుందని అటువంటి ఆమెను గౌరవించాలన్నారు. అలా ఆమెకు తన సొంతమని చెప్పుకోవడానికి ఏమీ మిగలదని… కుటుంబ సంక్షేమం కోసం ఆస్తుల సంపాదనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే భర్త అన్ని ఆస్తుల్లోను ఆమెకు వాటా ఉంటుందని ఇద్దరికీ సమాన వాటా ఉంటుందని స్పష్టం చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు జస్టిస్‌ రామస్వామి.

కాగా..తమిళనాడుకు చెందిన అమ్మాల్ అనే ఓ మహిళ మరణించిన తన భర్త పేరుతో ఉన్న ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలని కోరుతు వేసిన పిటీషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ రామస్వామి కీలక తీర్పునిచ్చారు. ఆమెకు అన్ని ఆస్తుల్లోనే వాటా ఉంటుందని తేల్చి చెప్పారు.