గడ్డి తిన్న సింహం! : ఏంటీ వింత

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 07:05 AM IST
గడ్డి తిన్న  సింహం! : ఏంటీ వింత

Updated On : August 30, 2019 / 7:05 AM IST

సింహానికి ఆకలేస్తే గడ్డి తినదు వేటాడి దర్జాగా మాంసమే తింటుంది. కానీ ఏమైందో ఏమోగానీ ఓ సింహం మాత్రం దీనికి రివర్స్ గా ఉంది పచ్చగడ్డి తింటున్న సింహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసినవారంతా. గుజరాత్ లోని  అమ్రేలి జిల్లాలోని ఖంబా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ చిత్ర విచిత్రమైన ఘటన. ఆకలితో ఉన్న సింహం వేట ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆకలితో ఉన్న మృగరాజు కంట పడిన ఎటువంటి జంతువైన ఖతమైపోవాల్సిందే. దానికి ఆహారమైపోవాల్సిందే. 

గాయపడినా..వృద్ధాప్యం వచ్చినా..సింహం సింహమే. కానీ ఈ సింహానికి ఎంత ఆకలేసిందో గానీ పచ్చగడ్డిని పరపరా నమిలేసింది. వేటాడిన జంతువు మాంసం తిన్నప్పుడు ఎలాగైతే…ముక్కల్ని పీక్కు తింటుందో…అచ్చంగా అలాగే గడ్డిని కూడా పీక్కుని మరీ తినేసింది. సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసివారంతా..రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వెజిటేరియన్ లయన్ అని ఒకరంటే… ఆ సింహం డైట్ పాటిస్తోందనీ… అందుకే మాంసం కాకుండా గడ్డి తింటోందని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల్ని వెంటాడి..వేటాడి మాంసం తినే మృగరాజు గడ్డి తినటం మాత్రం వెరైటీయే.

కాగా..జంతువులు కడుపులో ఉన్న ఆహారాన్ని బైటకు తేవాలంటే అంటే వాంతి చేసుకోవాలంటే గడ్డి తిని ఆహారాన్ని బైటకు తెచ్చుకుంటాయనే విషయం తెలిసిందే. కుక్కలు..పిల్లులు వంటి జంతువులు ఇలా చేయటాన్ని చాలా మంది చూసే ఉంటారు. మరి ఈ సింహం అందుకే గడ్డి తిన్నదా లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు.