Kishan Reddy : ప్రతి దేశ పౌరుడు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి

మనమంతా ప్రశాంతంగా కుటుంబం సభ్యులతో గడుపుతున్నామంటే అది సైనికుల ప్రాణ త్యాగం వల్లే అని ఆయన చెప్పారు. మన కోసం సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటారని అన్నారు.

Kishan Reddy : ప్రతి దేశ పౌరుడు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి

Kishan Reddy

Updated On : January 18, 2022 / 7:46 PM IST

Kishan Reddy : ప్రతి దేశ పౌరుడు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ ను కిషన్ రెడ్డి సందర్శించారు. మనమంతా ప్రశాంతంగా కుటుంబం సభ్యులతో గడుపుతున్నామంటే అది సైనికుల ప్రాణ త్యాగం వల్లే అని ఆయన చెప్పారు. మన కోసం సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటారని అన్నారు. వివిధ పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చే వారు.. నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యార్థులను నేషనల్ వార్ మెమోరియల్ చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో దేశ రక్షణలో అసువులు బాసిన అమరవీరులకు గుర్తుగా నేషనల్ వార్ మెమోరియల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 23 వేల మంది అమరవీరుల పేర్లతో నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు చేశారు.

దేశ రక్షణలో అమరులైన వీర జవాన్ల కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర నేషనల్ వార్ మెమోరియల్‌ను(జాతీయ యుద్ధ స్మారకం) కేంద్రం నిర్మించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల దేశం చూపుతున్న కృతజ్ఞతకు నిదర్శనంగా ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు.

Corona Medicines : ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వాడాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ రక్షణ కోసం అసువులు బాసిన వీర జవాన్లకు నివాళిగా ఓ స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. అందుకు అనుగుణంగా నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించారు. ఢిల్లీలోని ‘ఇండియా గేట్‌’ ప్రాంగణంలోని 40 ఎకరాల్లో నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక యుద్ధ స్మారకాన్ని రూ.176 కోట్లతో నిర్మించారు. యుద్ధ స్మారకంలోని 16 గోడలపై 25,942 మంది అమరవీరుల పేర్లు, వారి హోదా, రెజిమెంట్‌ వివరాలు చెక్కి ఉంటాయి. గ్రానైట్‌ రాతిపై వీటిని చెక్కించారు. యుద్ధ స్మారకం చుట్టూ అందమైన పూల మొక్కలు, వాటర్ ఫౌంటేన్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రదేశంగానూ దీన్ని తీర్చిదిద్దారు.