అసెంబ్లీ ముందు ధర్నాకి దిగిన మాజీ సీఎం

  • Published By: chvmurthy ,Published On : December 7, 2019 / 07:19 AM IST
అసెంబ్లీ ముందు ధర్నాకి దిగిన మాజీ సీఎం

Updated On : December 7, 2019 / 7:19 AM IST

ఉన్నావ్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సమాజ్ వాది పార్టీ నేతలతో కలిసి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  లక్నోలోని  అసెంబ్లీ గేటు ముందు ధర్నాకి దిగారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా ఆదివారం  రాష్ట్ర వ్యాప్తంగా శోకసభ పేరుతో ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం, హోం శాఖ కార్యదర్శి, డీజీపీ రాజీనామా చేసేంతవరకు బాధితులకు న్యాయం జరగదని ఆయన ఆరోపించారు. 

కాగా …ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గుర్తు చేశారు.