Ex CM Chautala : పది పరీక్ష రాసిన మాజీ సీఎం

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాశారు. తీహార్ జైలు నుంచి వచ్చి పది పరీక్ష రాశారు.

Ex CM Chautala : పది పరీక్ష రాసిన మాజీ సీఎం

Ex Cm Chautala

Updated On : August 19, 2021 / 10:08 AM IST

Ex CM Chautala : ఎమ్మెల్యే బోర్డు పరీక్షలు రాయడం చూసాం.. కానీ తాజాగా ఓ మాజీ ముఖ్యమంత్రి 10 పరీక్ష రాశాడు. అది కూడా ఇంగ్లీష్ పేపర్. పది పాస్ కాకుండానే ముఖ్యమంత్రిగా పనిచేశారు.. అవును ఇది నిజమే హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా బుధవారం పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు.

కాగా జేబీటి రిక్రూట్మెంట్ కేసులో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తీహార్ జైలు నుంచి వచ్చి సిర్సాలోని ఆర్య కన్యా సీనియర్ సెకండరీ స్కూల్లో పరీక్ష రాశాడు.

ఇంగ్లీష్ పరీక్ష పాస్ కాకుండానే ఓపెన్ భివాని ఎడ్యుకేషన్ బోర్డు12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5నా ఈ పరీక్షలు ఫలితాలు వెలువడ్డాయి.. కానీ చౌతాలా ఫలితాలను బోర్డు వెల్లడించలేదు. పెండింగ్ లో ఉన్న పదిపరీక్ష పూర్తిచేస్తేనే 12వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.

ఈ నేపథ్యంలోనే ఆయన కంపార్ట్ మెంట్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులు పలు ప్రశ్నలు అడగగా.. తాను ప్రస్తుతం విద్యార్థినని, నో కామెంట్స్‌ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా 1999-2005 వరకు చౌతాలా హర్యానా సీఎంగా పనిచేశారు.