మాజీ హైకోర్టు జడ్జి సీకే కరణ్ అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2020 / 04:50 PM IST
మాజీ హైకోర్టు జడ్జి సీకే కరణ్ అరెస్ట్

Updated On : December 2, 2020 / 4:58 PM IST

CS Karnan Arrested మద్రాస్ మరియు కలకత్తా హైకోర్టుల మాజీ జడ్జి సీకే కరణ్ ని బుధవారం(డిసెంబర్-2,2020)చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్డిల భార్యాలపైన మరియు మహిళా జడ్జిలపైన సీకే కరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెంట్రల్ చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.



కాగా, జడ్జిలు మరియు జడ్జిల భార్యలపైన సీకే కరణ్ చేసిన వ్యాఖ్యలు వీడియోలు ఆన్ లైన్ లో హల్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, మంగళవారం మద్రాస్ హైకోర్టు….కరణ్ పై దర్యాప్తు ప్రోగెస్ ని ధర్మాసనానికి తెలియజేసేందుకు డిసెంబర్-7న వ్యక్తిగతంగా కోర్టుకి హాజరుకావాలంటూ తమిళనాడు డీజీపీ మరియు చెన్నై పోలీస్ కమిషనర్ ని ఆదేశించింది. అంతకుముందు, కరణ్ పై కేసుకి సంబంధించి దర్యాప్తుని చెన్నై పోలీస్ కమిషనర్ హ్యాండిల్ చేయాలని మరియు డీజేపీకి నివేదించాలని కోర్టు కోరింది.



జడ్జిల భార్యలు,మహిళా లాయర్లు, మహిళా కోర్టు సిబ్బందిపై అత్యాచార బెదిరిపంపులు మరియు అసభ్య పదజాలంతో వారిని సీకే కరణ్ దూషించాడని దూషించాడని పేర్కొంటూ తమిళనాడు బార్ కౌన్సిల్ వేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని,అటువంటి వ్యాఖ్యాలు చేసినందుకు ఆయనపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కోరింది.