వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా…అక్టోబర్-4నుంచి రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2020 / 03:23 PM IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా…అక్టోబర్-4నుంచి రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీలు

Updated On : October 2, 2020 / 4:04 PM IST

Farm Bills protest; Rahul Gandhi tractor rallies కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ చట్టాలతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్‌ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్టోబర్ 4 నుండి అక్టోబర్-6వరకు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నారు. కాగా, అంతకుముందు అక్టోబర్ 3-5 నుండి గాంధీ ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపిన విషయం తెలిసిందే.


అయితే ఇప్పుడు రాహుల్ ట్రాక్టర్ ర్యాలీల షెడ్యూల్ అక్టోబర్ 4, 5, 6 కు మార్చబడిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జఖర్, పార్టీ పంజాబ్ ఇంచార్జ్ హరీష్ రావత్, మరియు రాష్ట్ర మంత్రులు మరియు పార్టీ ఎమ్మెల్యేలు ఈ నిరసనలలో పాల్గొంటారని తెలిపారు.

ట్రాక్టర్ ర్యాలీలకు రైతు సంస్థల సహకారం ఉంటుందని, మూడు రోజుల్లో 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ ప్రతినిధి గురువారం తెలిపారు. కఠినమైన COVID-19 ప్రోటోకాల్‌ మధ్య మూడు రోజులలో ప్రతి ఉదయం 11 గంటలకు ర్యాలీలు ప్రారంభం కానున్నాన్నట్లు తెలిపారు.


అక్టోబర్ 6 న హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని కైతాల్ మరియు పిప్లి వద్ద ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశం ఉంది, ఆ తరువాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లాడని తెలిపారు. .