Karnataka: లంచం అడిగిన అధికారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన రైతు.. సీఎం నియోజకవర్గంలో ఘటన..
పనికోసం కార్యాలయంకు వెళ్తే లంచం అడిగిన అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. లంచం రూపంలో డబ్బులు బదులు కార్యాలయంకు ఆవును తొలుకెళ్లారు. రైతుచేసిన పనికి కంగుతిన్న అధికారులు లంచం లేకుండానే పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంకాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో లంచం అడిగిన అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేశారు.

karnataka
Karnataka: ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురు అధికారులు లంచం ఇవ్వందే పనిచేయరు. అలాంటి అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పురావడం లేదు. దేశవ్యాప్తంగా లంచాలు తీసుకొని పనులుచేసే అధికారులకు కొదవలేదు. ఇదే కోవకు చెందిన ఓ అధికారికి రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. కర్ణాటక రాష్ట్రంలో ఓ రైతు పనినిమిత్తం కార్యాలయంకు వెళ్తే.. స్థానిక అధికారులు లంచం అడిగారు. పలుసార్లు కార్యాలయంకు వెళ్లినా ఉపయోగం లేకుండాపోయింది. అధికారుల తీరుతో అసహనానికి గురైన రైతు.. వారికి దిమ్మతిరిగే పనిచేశాడు. లంచం రూపంలో ఆవును ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో, ఆ ఆవును అధికారులకు ఇచ్చేందుకు ఏకంగా కార్యాలయంకు తోలుకెళ్లాడు. రైతు చేసిన పనికి వణికిపోయిన అధికారులు.. ఎలాంటి డబ్బులు లేకుండానే పని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
Karnataka: అవినీతి కేసులో ఇరుక్కున్న బీజేపీ ఎమ్మెల్యే బెయిల్ విచారణపై లాయర్ సంఘం అభ్యంతరం
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా సవనూర్ మున్సిపాలిటీలో ఓ పనినిమిత్తం ఎల్లప్ప రానోజీ అనే రైతు వెళ్లాడు. మున్సిపల్ రికార్డుల్లో పేరుమార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆపని చేయడానికి మున్సిపల్ అధికారులు డబ్బులు అడిగారు. తాను లంచం ఇచ్చుకోలేనని రైతు అధికారుల వద్ద వాపోయినా వారు వినిపించుకోలేదు. లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. చేసేదేమీలేక ఎల్లప్ప ఓ అధికారికి లంచం ఇచ్చారు. సరిగ్గా.. ఎల్లప్ప లంచం ఇచ్చిన రెండురోజుల్లోనే సదరు అధికారి బదిలీపై వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎల్లప్ప కార్యాలయంకు వచ్చి ప్రస్తుతం ఉన్న అధికారికి తన గోడును వెళ్లబోసుకున్నాడు. వారుసైతం లంచం ఇస్తేనే పనిచేస్తామని చెప్పడంతో విసుగెత్తిపోయిన రైతు అధికారులకు గుణపాఠం చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు.
Karnataka Assembly Polls: వేసవికి ముందే హీటెక్కిన కర్ణాటక.. మిగతావారి కంటే ఒక అడుగు ముందే ఉన్న ఓవైసీ
అధికారులకు మరోసారి లంచం ఇచ్చేందుకు నిర్ణయించుకున్న రైతు ఎల్లప్ప.. డబ్బులతో కాకుండా ఆవుతో మున్సిపల్ కార్యాలయంకు వెళ్లాడు. కార్యాలయం ఎదుట ఆవును కట్టేసి లంచం తీసుకోండి, నా పనిచేయండి అంటూ అధికారులకు విన్నవించుకున్నాడు. రైతు చేసిన పనికి కంగుతిన్న అధికారులు అతన్ని అక్కడినుంచి పంపించేందుకు ప్రయత్నించారు. అయినా, ఎల్లప్ప ఆవును తీసుకొని నా పనిచేయాలని పట్టుబట్టడంతో అధికారులు దిగొచ్చి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సొంతం జిల్లాలో జరగడంతో చర్చనీయాంశంగా మారింది. విషయంకాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో రైతు ఎల్లప్ప రానోజిని లంచం డిమాండ్ చేసిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.