Acid Attack
Maharashtra: తాను చెప్పిన ప్రదేశాలకు తన బిడ్డతో కలిసి హనీమూన్ కు వెళ్లేందుకు అల్లుడు నిరాకరించడానే కోపంతో మామ దారుణానికి పాల్పడ్డాడు. విచక్షణ కోల్పోయి కొత్త అల్లుడిపై యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో అల్లుడికి తీవ్ర గాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యాసిడ్ దాడి అనంతరం మామ పరారీలో ఉన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Gossip Garage : నల్గొండ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నం..!
ఠాణె జిల్లాకు చెందిన ఇబాద్ అతీక్ ఫాల్కేకు అదే ప్రాంతానికి చెందిన జాకీ గులామ్ ముర్తజా ఖోటాల్ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. పెండ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే, నూతన జంట హనీమూన్ కు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హనీమూన్ కోసం కాశ్మీర్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు మామ ముర్తజాకు అల్లుడు తెలిపాడు. అయితే, కశ్మీర్ వద్దు.. విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లండి.. అక్కడ ప్రశాంతంగా ఉంటుందని సూచించాడు. అందుకు అల్లుడు నిరాకరించాడు. కశ్మీర్ వెళ్లేందుకు మేము నిర్ణయించుకున్నామని అల్లుడు చెప్పడంతో ముర్తజా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మామ, అల్లుడి మధ్య వివాదం చోటు చేసుకుంది.
Also Read: Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. నాసా ఏం చెప్పిందంటే?
అల్లుడు తన నిర్ణయాన్ని వ్యతిరేకించాడనే కోపంతో ఆగ్రహంతో ఉన్న ముర్తజా.. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన అల్లుడిపై దాడి చేశాడు. అతీక్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్లే క్రమంలో అప్పటికే యాసిడ్ బాటిల్ తో కాచుకొని ఉన్న ముర్తజా ఉన్నపళంగా అల్లుడి ముఖంపై, శరీరంపై యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో అతని ముఖంపై, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తరువాత ముర్తజా అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతీక్ ఫాల్కే తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతీక్ తరపు వారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూర్తజా కోసం గాలిస్తున్నారు.