Gossip Garage : నల్గొండ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నం..!
అధికారాన్ని అడ్డం పెట్టుకొని డర్టీ పనులు చేసే ఇలాంటి ఖాకీల తీరు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెస్తోందనేది లోకల్ టాక్.

Gossip Garage : కాపాడాల్సిన కంచే కాటేస్తే.. కనురెప్పే కంటికి కత్తిలా మారితే.. ఎవరిని నిందించాలి.. ఎవరికి నివేదించాలి. సమాజ రక్షకులే.. సమాజం తలదించుకునే తప్పులు చేస్తుంటే.. ఇక న్యాయం గెలిచేదెప్పుడు.. బతికేదెప్పుడు. నల్గొండ జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం అలాంటిదే.. మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చలా మారిందనే చర్చకు దారితీసిన వ్యవహారం ఇది.
పోలీసులంటేనే సమాజాన్ని కాపాడే రక్షక భటులు. బాధితుల పక్షాన నిలవాల్సిన వ్యక్తులు. ఎక్కడ అన్యాయం జరిగినా.. ఎక్కడ అవినీతి జరిగినా… తామున్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది. ఐతే విధి నిర్వహణలో కొందరు శభాష్ అనిపించుకుంటుంటే మరికొందరు ఛీ అని
ఈసడించుకునేలా చేస్తున్నారు.
మహిళపై కన్నేసిన సీఐ?
నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నమైపోయిందంట. దీంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయ్. ఓ మహిళ తన కుటుంబ వివాదంపై పోలీసుల్ని ఆశ్రయించింది. భార్యభర్తలిద్దరికీ నచ్చచెప్పి, కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యను పరిష్కరించాల్సిన సీఐ… ఆ మహిళపై కన్నేశాడనేది హాట్ టాపిక్‌గా మారింది.. ఆమె భర్తను హింసించి ఇద్దరిని కలవకుండా చేయడమే కాకుండా.. ఒంటరిగా ఉన్న ఆ మహిళను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకున్నాడనే చర్చ పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది..
అంతటితో సరిపెట్టుకోలేదంట ఆ ఖాకీ.. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు భర్తపై కేసులు పెట్టించాడంట.. సీఐ ఆగడాలతో ఆ బాధితుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. బాధితుడు చూపించిన పక్కా ఆధారాలు, ఆ సీఐ చేసిన చాటింగ్ చూసి నిర్ఘాంతపోయిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది..
ఐతే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్నల్‌గా చర్చ గట్టిగానే జరుగుతోందని టాక్.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని డర్టీ పనులు చేసే ఇలాంటి ఖాకీల తీరు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెస్తోందనేది లోకల్ టాక్.. మరి దీనికి ఉన్నతాధికారులు ఎలాంటి ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి..
Also Read : కేటీఆర్ అరెస్ట్ జరిగితే కారు స్టీరింగ్ ఆ ఇద్దరిలో ఎవరికి..?