Acid Attack: ప్రతీకారేచ్ఛతో ఇద్దరు మహిళలపై తండ్రీకొడుకుల యాసిడ్ దాడి
అహ్మదాబాద్ లోని అమెర్లీ సావర్కుండ్లా ప్రాంతంలో హాస్పిటల్ కు వెళ్లివస్తున్న ఇద్దరు మహిళలపై తండ్రీకొడుకులు యాసిడ్ దాడి జరిపారు. వారిలో ఒకరు గర్భిణీగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

acid-attack-on-2-women
Acid Attack: అహ్మదాబాద్ లోని అమెర్లీ సావర్కుండ్లా ప్రాంతంలో హాస్పిటల్ కు వెళ్లివస్తున్న ఇద్దరు మహిళలపై తండ్రీకొడుకులు యాసిడ్ దాడి జరిపారు. వారిలో ఒకరు గర్భిణీగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రతీకార భావనతోనే దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధిత మహిళల్లో ఒకరి వయస్సు 27ఏళ్లు కాగా మరొకరి వయస్సు 37ఏళ్లు. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు వైద్యులు చెప్పారు. బాధితుల స్టేట్మెంట్లు రికార్డు చేయడంతో స్థానికంగా అదే ప్రాంతంలో ఉండే తండ్రీకొడుకులే దాడికి పాల్పడినట్లు తెలిసింది.
బాధితుల ఫిర్యాదుమేరకు ఐపీసీ 328ఏ ప్రకారం.. తండ్రీకొడుకుల్ని సోమవారం అరెస్టు చేశారు. బాధితురాళ్లు 15-30శాతం కాలిన గాయాలు ఉండగా.. గర్భిణీ మహిళకు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. విచారణ కొనసాగుతుందని ఎస్పీ నిర్లిప్త్ రాయ్ అంటున్నారు.
Read Also : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
గతంలో సావర్కుండా ప్రాంతంలో ఒక మహిళపై రిపీటెడ్ గా రేప్ చేశారంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. అందులో నేరస్థులుగా పేర్కొన్నవారే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. బాధితురాళ్లు ఇద్దరూ ఒకే ఇంటి కోడలు, కూతురు అని విచారణలో తేలింది.