Ghaziabad : మహిళా ఆటో రిక్షా డ్రైవర్ వీరంగం.. ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టి..

ఓ ట్రాఫిక్ పోలీసు పట్ల మహిళా ఆటో రిక్షా డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించింది. చెప్పుతో కొడుతూ నానా దుర్భాషలాడింది. ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు అసలు కారణమేంటి? చదవండి.

Ghaziabad

Ghaziabad : ఓ మహిళా ఆటో రిక్షా డ్రైవర్ ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు.

Viral Video : గాజులు తొడిగి.. పూలు జల్లి కుక్కకు శ్రీమంతం.. వైరల్ అవుతున్న వీడియో

ఓ మహిళా ఆటో రిక్షా డ్రైవర్ చెప్పుతో ట్రాఫిక్ పోలీసును పదే పదే కొట్టిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం‌లో ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది.

@Manishkumarttp అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో క్లిప్‌లో జనం గుంపుగా కనిపించారు. మహిళ చెప్పుతో పోలీసును నెట్టడం, కొట్టడం కనిపించింది. పోలీసు ఆమెను నిలువరించడం కోసం చేయి ఎత్తినట్లు కనిపించింది. చివర్లో పోలీసు అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు వీడియో ఎండ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.

Kerala : పిల్లాడు కాదు పిడుగు.. 4 ఏళ్లకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడుపుతున్న బాలుడి వీడియో వైరల్

సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి పూనమ్ మిశ్రా ఈ ఘటనపై స్పందించారు. మహిళా ఆటో రిక్షా డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని అన్నారు. ఆటో రిక్షాల కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ల గురించి అనేక ఫిర్యాదులు అందడంతో పోలీసు సంఘటనా స్థలానికి వెళ్లారని.. ఆటో రిక్షాను అక్కడి నుంచి తరలించమని మహిళను కోరడంతో ఆమె అనుచితంగా ప్రవర్తించిందని పూనమ్ మిశ్రా చెప్పారు. ఆమె ప్రవర్తనపై గతంలో కూడా ఫిర్యాదులు అందినట్లు పూనమ్ మిశ్రా పేర్కొన్నారు.