Viral Video : గాజులు తొడిగి.. పూలు జల్లి కుక్కకు శ్రీమంతం.. వైరల్ అవుతున్న వీడియో
చాలామంది జంతు ప్రేమికులు తాము పెంచుకునే పెట్స్‌కి వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ శునకానికి జరిగిన వేడుక ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video
Viral Video : చాలామంది పెంపుడు జంతువుల్ని కూడా కుటుంబ సభ్యుల్లాగనే భావిస్తారు. వాటికి పుట్టినరోజు, ప్రత్యేక రోజులు జరుపుతుంటారు. కుక్కకి శ్రీమంతం అంటూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో
గోల్డెన్ రిట్రీవర్ డాగ్‌కి దాని యజమానులు శ్రీమంతం చేసిన వీడియో వైరల్ అవుతోంది.
డాగ్ లవర్స్ చాలామంది ఉంటారు. ఇళ్లలో పెంచుకునే వాటిని అడాప్ట్ చేసుకున్న రోజు, వాటికి శ్రీమంతం వంటివి చేసి సంబరపడుతుంటారు. తాజాగా ఇలాంటి వేడుక ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. రోజీ, రెమో అనే రెండు కుక్కల యజమానులైన సిద్దార్ధ్ శివమ్ ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఇక్కడ శ్రీమంతం వేడుక రోజీకి అన్నమాట.
రోజీ చాలా కూల్‌గా కూర్చున్నట్లు వీడియో ఓపెన్ అవుతుంది. రోజీపై ఎరుపురంగు చున్నీని కప్పి.. నుదుటన బిందీ పెట్టి, కాళ్లకు గాజులు తొడిగారు. గులాబీ పూల రేకులు రోజీ మీద చల్లి స్వీటు తినిపించారు. రోజీ పక్కన ‘నేను సిద్ధంగా ఉన్నాను’ అనే బోర్డు కనిపిస్తుంది. రెమో రోజీ పక్కన ‘నేను ఉన్నాను’ అనే బోర్డుతో కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రోజీ శ్రీమంతం వీడియో వైరల్ అవుతోంది. ఇంత అందమైన వీడియో ఎప్పుడూ చూడలేదని.. రోజీకి సాఫీగా ప్రసవం జరగాలని నెటిజన్లు విష్ చేసారు.
View this post on Instagram