Biden Pet Dog Commander : జోబైడెన్ పెంపుడు కుక్కకు ఏమైంది..? సెక్యురిటీ సిబ్బందిని పదే పదే ఎందుకు కరుస్తోంది..?
జోబైడెన్ పెంపుడు కుక్క ఆయన సెక్యురిటీ సిబ్బందిని పదే పదే కరుస్తోంది. మూడు నెలల్లో 10సార్లు కరిచింది.

Biden Pet Dog Commander
Biden Pet Commander bitten Secret Service officers : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కు ఓ పెంపుడు కుక్క ఉంది. అది జర్మన్ షెపర్డ్ జాతికి చెందినది. దానికి బైడెన్ ‘కమాండర్’ (Commander) అని పేరు పెట్టుకున్నారు. ఆకుక్కను బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారట. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు లాగా ఆయన కుక్క కూడా వార్తల్లో వార్తగా మారింది. ఎందుకంటే ఈ కమాండ్ యజమాని సెక్యురిటీ సిబ్బందిని పదే పదే కరుస్తోందట. మరి వాళ్లను చూస్తే దానికి ఏమనిపిస్తోందో గానీ మూడు నెలల్లోనే 10సార్లు కరిచిందట.
బైడెన్ సీక్రెట్ సర్వీస్ అధికారులను (Secret Service staff) ఆయన పెంపుడు కుక్క కమాండర్ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య పది సార్లు కరిచిందట.ఈ విషయాన్ని వైట్ హౌస్ (White House)అధికారులే నిర్ధారించారు. కమాండర్ కరవటం..వారి చికిత్స చేయించుకోవటం జరుగుతోందట..మరి అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై కమాండర్ పదే పదే ఎందుకు విరుచుపడుతోంది..ఎందుకు అన్నిసార్లు కరుస్తోందో మరి..మూడు నెలల్లో ఏకంగా పది సార్లు కరటం అంటే ఆలోచించాల్సిందేననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
కాగా గతంలో కూడా మేజర్ అనే బైడెన్ పెంపుడు కుక్క కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరిచింది. దీంతో బైడెన్ దాన్ని డెలావేర్‌లోని వెల్మింగ్టన్‌లో బైడెన్ నివాసానికి తరలించేశారు. మరి కమాండ్ కూడా అస్తమాను సెక్యురిటీ సిబ్బందిని కరుస్తోంది. మరి దీన్ని కూడా పంపింస్తారే లేదో వేచి చూడాలి..
కాగా బైడెన్ దంపతులు ‘మేజర్’, ‘ఛాంప్’ అనే రెండు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలను పెంచుకుంటున్నారు. మేజర్ వయస్సు మూడేళ్లు. ఈ శునకాలు బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన వారం తర్వాత శ్వేత సౌధంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ ఇవి అక్కడి వాతావరణానికి అలవాటుపడలేకపోక వైట్ హౌస్ లోని సిబ్బందిని మేజర్ అనే కుక్క తరచు కరుస్తుండేది. భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేసి గాయపర్చింది. దీంతో ఆ రెండు కుక్కలను డెలావేర్‌లోని బైడెన్ కుటుంబం నివసించే వెల్మింగ్టన్‌కు తరలించారు.
మేజర్ అనే కుక్క వైట్ హౌస్ లో ఉన్న సమయంలో దాని దూకుడుగా ఉండేది. వైట్ హౌస్ లోనే ఫర్నిచర్ పై దూకటం..సోఫాల్లో ఎక్కటం..అలా దాని ఇష్టమొచ్చినట్లుగా ఉండేది.దీంతో జోసతీమణి కంట్రోల్ చేసేవారు.తమ పెంపుడు కుక్కలు ఎక్కువసేపు హౌస్ లోని సోఫాలపై పడుకోవటం వంటివి చేస్తుండటంతో హౌస్ లోని సిబ్బందిపై దాడి చేయడంతో ఇక వాటిని డెలావేర్‌కు తరలించాల్సి వచ్చింది.