Kerala : పిల్లాడు కాదు పిడుగు.. 4 ఏళ్లకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతున్న బాలుడి వీడియో వైరల్
4 సంవత్సరాల వయసులో ఓ చిన్నారి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపేస్తున్నాడు. అంతేనా ఇంకా ఏమేమి నడుపుతూ అబ్బురపరుస్తున్నాడో చదవండి.

Kerala
Kerala : నాలుగేళ్ల వయసులో పిల్లలు వారి కోసం తయారు చేసిన సైకిళ్లు తొక్కుతుంటారు. అదీ ఇంటి ఆవరణలో. కానీ ఓ చిన్నారి రోడ్డుపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపేస్తున్నాడు. పిల్లాడు కాదు పిడుగు అనిపిస్తున్న ఆ బాలుడు వీడియో వైరల్ అవుతోంది.
కేరళకు చెందిన నాలుగేళ్ల బాలుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో పాటు యమహా RX100 బైక్ కూడా నడిపేస్తున్నాడు. ఈ చిన్నారి బైక్ డ్రైవింగ్ నైపుణ్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేనా ఆ బుడ్డోడు టాటా జెనాన్ పికప్ ట్రక్కును కూడా నడిపేస్తాడట. ఇవన్నీ తన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో పలు జాగ్రత్తలతోనే చేస్తున్నాడు.
Agra : అమ్మ కోసం, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎంత దూరం నడిచాడంటే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్‌ని ఎంతో నైపుణ్యంతో చిన్నారి నడపడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘హ్యాట్సాఫ్.. సింప్లీ బ్రిలియంట్’ అంటూ ప్రశంసలు కురిపించారు. బాలుడు రైడింగ్ చేస్తున్నప్పుడు అతని తండ్రి వెనకాలే ఉండి అనుసరిస్తున్నట్లు వీడియోలో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. చిన్నారి అసాధారణ ప్రతిభకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
View this post on Instagram